గతేడాది ఫిబ్రవరి 28 నుంచి జులై 13 మధ్య ఆ కంపెనీ కార్లు కొన్నారా.. డేంజర్ జోన్‌లో పడ్డట్లే.. వెంటనే ఇలా చేయండి..!

Kia Seltos, Fault in Electronic, Oil Pump Controller, Auto Mobile

Update: 2024-02-26 10:55 GMT

గతేడాది ఫిబ్రవరి 28 నుంచి జులై 13 మధ్య ఆ కంపెనీ కార్లు కొన్నారా.. డేంజర్ జోన్‌లో పడ్డట్లే.. వెంటనే ఇలా చేయండి..!

Kia Seltos: కియా ఇండియా తన సెల్టోస్ ఎస్‌యూవీని దేశంలో రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. కార్‌మేకర్ ఫిబ్రవరి 28, జులై 13, 2023 మధ్య తయారు చేసిన CVT ట్రాన్స్‌మిషన్‌తో 1.5-లీటర్ NA పెట్రోల్ సెల్టోస్ 4,358 యూనిట్లను రీకాల్ చేసింది. ఈ రీకాల్‌కు కారణం ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్‌లో లోపాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఇది ఈ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌తో SUV పనితీరును ప్రభావితం చేస్తుంది.

యజమానులను కోరిన ఆటోమేకర్ సెల్టోస్..

ఇప్పటికే యజమానులను అలర్ట్ చేసినట్లు తెలిసింది. ఈ మార్పులను ఉచితంగా భర్తీ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఇది HTE, HTK, HTK ప్లస్, HTX, HTX ప్లస్, GTX ప్లస్, X-లైన్ ఏడు వేరియంట్‌లతో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఐదు సీట్ల SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.90 లక్షలుగా ఉంది.

మరో వార్తలో, సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఇటీవల దేశంలో లక్ష బుకింగ్స్ మార్కును దాటింది. జులై 2023లో ప్రారంభించారు. ఈ SUV ప్రతి నెలా సగటున 13,500 బుకింగ్‌లను అందుకుంటుందంట. 80 శాతం మంది కొనుగోలుదారులు టాప్-స్పెక్ వేరియంట్‌లను ఎంచుకుంటున్నారు.

Tags:    

Similar News