Kia: ఫుల్ ఛార్జ్‌తో 708 కిమీల రేంజ్.. ADAS వంటి భద్రతా ఫీచర్లు.. భారత్‌లో విడుదల కానున్న 4 ఎలక్ట్రిక్ కార్లు..!
Kia Electric Cars: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, కార్ల తయారీ కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
Kia Electric Cars: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, కార్ల తయారీ కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. కొరియన్ వాహన తయారీ సంస్థ కియా మోటార్ ఇండియా కూడా భారతదేశంలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి సిద్ధమవుతోంది.
2026 నాటికి భారతీయ EV మార్కెట్లో మూడు కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. వీటిలో కియా EV9, EV3, కారెన్స్ EV ఉన్నాయి. అదే సమయంలో, కంపెనీ భారతదేశంలో ఇప్పటికే ఉన్న EV6 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కూడా తీసుకువస్తుంది.
ఈ కార్ల అంచనా ఫీచర్లు, రేంజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కియా మోటార్స్ ఈ సంవత్సరం భారతదేశంలో విడుదల చేయనున్న మొదటి కొత్త ఎలక్ట్రిక్ కారు Kia EV9. అంతర్జాతీయ మార్కెట్లో, ఈ వాహనం 2 పవర్‌ట్రెయిన్ ఎంపికలతో వస్తుంది. ఇది సింగిల్ మోటార్‌తో వెనుక చక్రాల డ్రైవ్ (RWD), డ్యూయల్ మోటార్‌తో ఆల్ వీల్ డ్రైవ్ (AWD) ఎంపికను కలిగి ఉంటుంది.
ఈ కారు 99.8kWh బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. కారు ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇందులో రెండు 12.3-అంగుళాల స్క్రీన్‌లు, 14-స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్, వెహికల్-టు-లోడ్, 9 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS వంటి ఫీచర్లు ఉంటాయి.
Kia EV3 2026లో భారత్‌లోకి ఎంట్రీ..
Kia EV3 కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV 2026లో భారతదేశానికి రానుంది. ఈ కారు ఇటీవల 2 బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో ప్రపంచవ్యాప్తంగా వెల్లడైంది. ఈ కారు ఒక్క ఎలక్ట్రిక్ మోటారుతో ఫుల్ ఛార్జింగ్ తో 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు.
రాబోయే ఎలక్ట్రిక్ కారు కేవలం 7.5 సెకన్లలో 100 కిమీ వేగాన్ని అందుకోగలదని, దాని గరిష్ట వేగం 180 కిమీగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ కారులో డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్, క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లెవల్-2 ADAS వంటి ఫీచర్లు ఉంటాయి.
కియా కేరెన్స్ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా..
కియా కంపెనీ పెట్రోల్ పవర్డ్ కియా కేరెన్స్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా లాంచ్ చేయవచ్చు. దీని బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్ గురించిన సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అయితే, ఇది దాదాపు 400-500 కిలోమీటర్ల పరిధితో వస్తుందని భావిస్తున్నారు. ఈ కారులో 10.25-అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, ADAS ఫీచర్లు ఉంటాయి.
Kia EV6 ఫేస్‌లిఫ్ట్ కూడా..
కంపెనీ 2022లో భారతదేశంలో ప్రారంభించిన Kia EV6 అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను 12-18 నెలల్లో విడుదల చేస్తుంది. EV6 ఫేస్‌లిఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన బ్యాటరీ ప్యాక్, కొత్త డిజైన్‌తో పునఃరూపకల్పన చేయనున్నారు.
ఈ కారు 12.3-అంగుళాల డ్యూయల్ స్క్రీన్, మల్టీ-జోన్ టచ్ బేస్డ్ క్లైమేట్ కంట్రోల్, పవర్ అడ్జస్టబుల్ సీట్లు, లెవల్-2 ADAS వంటి భద్రతా ఫీచర్లతో రానుంది. ఈ కారు ఫుల్ ఛార్జింగ్‌తో దాదాపు 500 కిలోమీటర్ల రేంజ్‌ను అందుకుంటుంది.