Kia EV9: కియా లగ్జరీ ఈవీ.. ఈ పాయింట్లు చూస్తే మతిపోతుంది భయ్యా..!
Kia EV9: భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్ల (EV) డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అయితే ప్రస్తుతం ఈ విభాగంలో టాటా మోటార్స్ పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తోంది.
Kia EV9: భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్ల (EV) డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అయితే ప్రస్తుతం ఈ విభాగంలో టాటా మోటార్స్ పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తోంది. మొత్తం ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలలో టాటా మోటార్స్ మాత్రమే దాదాపు 65 శాతం వాటాను కలిగి ఉంది. ఈ సెగ్మెంట్‌కు ఉన్న డిమాండ్‌ను చూసి ఇప్పుడు అనేక ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు తమ అనేక మోడల్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో కియా ఇండియా ఇటీవల భారత మార్కెట్లో తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV EV9 ను విడుదల చేసింది. Kia EV9 భారతదేశంలో పూర్తిగా CBU మార్గం ద్వారా వస్తుంది. Kia EV9 తన కస్టమర్‌లకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. ఈ క్రమంలో Kia EV9 ఫీచర్ల గురించి 5 పాయింట్లలో వివరంగా తెలుసుకుందాం.
1. Kia EV9 డిజైన్‌లో బోల్డ్ ఫ్రంట్ గ్రిల్, స్లిమ్ LED హెడ్‌లైట్‌లను కలిగి ఉంది. కొలతల పరంగా కారు పొడవు 4,930 మిమీ, వెడల్పు 1,890 మిమీ, ఎత్తు 1,755 మిమీ అయితే వీల్‌బేస్ 3,100 మిమీ.
2. పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడినట్లయితే Kia EV9 99.8kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది తన కస్టమర్‌లకు ఒక్కసారి ఛార్జింగ్‌పై 561 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని పేర్కొంది. కేవలం 24 నిమిషాల్లోనే కారు 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
3. స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే Kia EV9 గరిష్టంగా 378bhp పవర్, 700Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేయగలదు. అయితే కారు 5.3 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
4. మరోవైపు, Kia EV9లో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ సన్‌రూఫ్, ADAS టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
5. భారతీయ మార్కెట్‌లో Kia EV9 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.29 కోట్లు వరకు ఉంటుంది. Kia EV9 భారతీయ మార్కెట్లో ఒకే ఒక వేరియంట్‌లో అందుబాటులో ఉంది.