Kia Clavis: లీకైన కియా క్లావిస్ ఫొటోలు.. విడుదలకు ముందే ఫిదా చేస్తోన్న ఫీచర్లు, డిజైన్.. టాటా పంచ్‌కే పంచ్ వేసేలా ఉందే..!

Kia Clavis: కియా B-SUV క్లావిస్‌ను పరీక్షించడం ప్రారంభించింది. ఇది ఇటీవల అంతర్జాతీయ రహదారులపై పరీక్షించారు. కియా ఇటీవలే భారతదేశంలో క్లావిస్ పేరును నమోదు చేసింది.

Update: 2024-03-15 15:30 GMT

లీకేజీ ఫొటోల ప్రకారం, కియా క్లావిస్ ఈ టెస్ట్ మోడల్ పూర్తిగా కవర్ చేశారు. అయితే, డిజైన్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న కారులో డ్యూయల్ టోన్ రూఫ్ రెయిల్స్, అల్లాయ్ వీల్స్ ఉంటాయని ఫొటోలు వెల్లడిస్తున్నాయి. ఫ్రంట్ డోర్ మౌంటెడ్ ORVMలు, బాడీ-కలర్ A, B-పిల్లర్లు, ముందు, వెనుక భాగంలో క్వార్టర్ గ్లాసెస్ ఉన్నాయి.

మునుపటి స్పై ఫొటోల ప్రకారం, క్లావిస్ B-SUV ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED టైల్‌లైట్లు, రెండు-టోన్ ఇంటీరియర్ థీమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లతో వస్తుంది.

ఇప్పటి వరకు కియా క్లావిస్ ఇంజిన్ గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. ఈ భారతీయ మోడల్ 1.2-లీటర్, నాలుగు-సిలిండర్ NA పెట్రోల్ ఇంజన్, ఐదు-స్పీడ్ మాన్యువల్, AMT యూనిట్‌తో రావచ్చు. ప్రారంభించిన తర్వాత, క్లావిస్ టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్సెటర్‌తో పోటీపడుతుంది.

Tags:    

Similar News