Jawa 42 Bobber Rash Sheen Edition: నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోండి.. భారత మార్కెట్‌లోకి జావా 42 బాబర్ రేష్ షీన్ ఎడిషన్.. ధర, ఫీచర్లు ఇవే..
Jawa 42 Bobber Rash Sheen Edition: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జావా యెజ్డీ మోటార్‌సైకిల్ తన పాపులర్ బైక్ జావా 42 బాబర్‌ను కొత్త కలర్ ఆప్షన్‌తో విడుదల చేసింది.
Jawa 42 Bobber Rash Sheen Edition: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జావా యెజ్డీ మోటార్‌సైకిల్ తన పాపులర్ బైక్ జావా 42 బాబర్‌ను కొత్త కలర్ ఆప్షన్‌తో విడుదల చేసింది. కొత్త రెడ్ షీన్ కలర్‌తో కంపెనీ ఈ వేరియంట్‌ను రూ. 2.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో పరిచయం చేసింది.
ఈ మోడల్ జావా బాబర్ మోడల్‌ల ఫ్యాక్టరీ-కస్టమ్ లైనప్‌లో బ్లాక్ మిర్రర్ ఎడిషన్‌తో టాప్ ఎండ్ వేరియంట్‌గా వచ్చింది. అంటే, మీరు ఫ్యాక్టరీలో మీ అవసరానికి అనుగుణంగా బైక్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. జావా 42 బాబర్ రెడ్ షీన్ ఎడిషన్ ముంబైలోని ఆల్ యు కెన్ స్ట్రీట్ ఫెస్టివల్ (ఏవైసీఎస్)లో విడుదలైంది.
బైక్ బుకింగ్ ప్రారంభించారు. దీని డెలివరీ కూడా త్వరలో చేయనున్నారు. ఇది ఇండియన్ మార్కెట్లో రోడ్‌స్టర్ బైక్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350కి పోటీగా ఉంది.
జావా 42 బాబర్ రెడ్ షీన్ ఎడిషన్ డిజైన్..
కొత్త రంగుతో పాటు బైక్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో జావా 42 బాబర్ బ్లాక్ మిర్రర్ ఎడిషన్ డిజైన్, ఫీచర్లు మాత్రమే ఇచ్చారు. ఇది నలుపు, వెండి ముగింపుతో డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది. వీటిలో ట్యూబ్‌లెస్ టైర్లు అందుబాటులో ఉన్నాయి. గేర్, ఇంజిన్ కవర్ కూడా బ్లాక్ మిర్రర్ వంటి కొత్త డిజైన్ ఇచ్చారు.
జావా 42 బాబర్ రెడ్ షీన్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది. ఇది సిల్వర్ క్రోమ్, రెడ్ కలర్‌లో బ్లాక్డ్-అవుట్ గ్రాఫిక్‌లతో రూపొందించారు. దీని సామర్థ్యం 12.5 లీటర్లు. ఇది కాకుండా, బైక్‌లోని అన్ని భాగాలు పియానో బ్లాక్, మ్యాట్ బ్లాక్ కలర్‌లో కనిపిస్తాయి.
ట్రాన్స్‌మిషన్ కవర్‌పై జావా బ్రాండింగ్, ప్యానెల్ కవర్‌పై బాబర్ 42 బ్రాండింగ్ ఇచ్చారు. డ్యూయల్ ఎగ్జాస్ట్ పైపులు మ్యాట్ బ్లాక్ కలర్‌లో ఉన్నాయి. బాబర్ ఒక జత బార్-ఎండ్ మిర్రర్‌లను కూడా పొందుతుంది. ఒకే లెదర్ శాడిల్-రకం సీటును కలిగి ఉంది. బైక్ వ్యాట్ 185 కిలోలుగా పేర్కొన్నారు.
జావా 42 బాబర్ రెడ్ షీన్ ఎడిషన్: బ్రేకింగ్, సస్పెన్షన్..
రైడ్ నాణ్యతను మెరుగుపరచడానికి, కంపెనీ బైక్‌లో వెనుక సస్పెన్షన్‌లో మోనో షాక్ అబ్జార్బర్, ముందు భాగంలో టెలిస్కోప్ ఫోర్క్‌లను అందించింది. బ్రేకింగ్ కోసం, ఇది డ్యూయల్ ఛానెల్ ABS తో పాటు రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఫీచర్ల విషయానికొస్తే, బైక్‌లో రెండు-దశల సర్దుబాటు సీటు, USB ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్ కన్సోల్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, పూర్తి LED లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.