Car Maintenance: కారు సైలెన్సర్ వరకు నీటిలో మునిగిందా.. ఈ తప్పులు చేస్తే లక్షల రూపాయలు నష్టమే..!

Car Maintenance: దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.

Update: 2023-07-20 07:43 GMT

Car Maintenance: కారు సైలెన్సర్ వరకు నీటిలో మునిగిందా.. ఈ తప్పులు చేస్తే లక్షల రూపాయలు నష్టమే..!

Car Maintenance: దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఇళ్లు, పంట పొలాలు, వాహనాలు మునిగిపోయాయి. వరదల వల్ల చాలా ఆస్తి నష్టం జరుగుతుంది. నీటి వేగానికి వాహనాలు కొట్టుకుపోతాయి. ఇన్సూరెన్స్‌ ఉంటే పర్వాలేదు కానీ లేదంటే లక్షల రూపాయలు నష్టపోవాల్సిందే. అయితే కొన్నిసార్లు కార్లు సైలెన్సర్‌ వరకు మునిగిపోయి ఉంటాయి. ఇలాంటి సమయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరిస్తే లక్షల రూపాయల వాహనాన్ని కాపాడుకోవచ్చు. ఏం చేయాలో ఈరోజు తెలుసుకుందాం.

కారు స్టార్ట్‌ చేయవద్దు

కారు నీళ్లలో మునిగితే ఇంజన్‌లోకి నీళ్లు వస్తే లక్షల్లో ఖర్చవుతుంది. నీరు కారులోని ఎలక్ట్రికల్ భాగాలను దెబ్బతీస్తుంది. కానీ తెలివిగా ఆలోచిస్తే భారీ నష్టాల నుంచి రక్షించుకోవచ్చు. కారు సైలెన్సర్ వరకు నీటిలో మునిగి ఉంటే కారుని ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయవద్దు. దీనివల్ల ఇంజిన్లోకి నీరు వచ్చే ప్రమాదం ఉంటుంది. కారును స్టార్ట్ చేస్తే ఇంజిన్ పూర్తిగా దెబ్బతింటుంది. ముందుగా ఇంజిన్‌ను చెక్‌ చేయడానికి డిప్‌స్టిక్‌ను తీసి ఇంజిన్‌లోకి నీరు చేరిందో లేదో చూడాలి. ఒకటి లేదా రెండు చుక్కల నీరు కనిపిస్తే ఇంజిన్‌లోకి నీరు ప్రవేశించిందని అర్థం చేసుకోవాలి.

ఈ చిట్కాలు పాటించండి

ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా కారు బ్యాటరీని డిస్‌కనెక్ట్ చేయాలి. ఇది కారు ఎలక్ట్రికల్ భాగాలు, వైర్లలోకి నీరు రాకుండా చేస్తుంది. ఇలా చేయకపోతే నీరు కారు వైర్లోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది. కారు నుంచి నీటిని తీసివేయడానికి కారును పొడిగా, ఎండగా ఉండే ప్రదేశానికి నెట్టుకుపోవాలి. తర్వాత కారు డోర్లు తెరిచి కొన్ని గంటలపాటు ఆరనివ్వాలి. దీనివల్ల కారులోని నీళ్లన్నీ ఆరిపోతాయి.

కారు ఇంజిన్ ఆయిల్, కూలెంట్‌ను మార్చండి ఎందుకంటే ఇంజిన్‌లోకి నీరు ప్రవేశించినప్పుడు ఇంజిన్ ఆయిల్, కూలెంట్‌తో కలుస్తాయి. దీని కారణంగా ఇంజిన్ ఆయిల్, కూలెంట్ రెండూ పాడైపోతాయి. ఈ పరిస్థితిలో కారును ప్రారంభించే ముందు ఇంజిన్ ఆయిల్, కూలెంట్‌ మార్చడం అవసరమని గుర్తించండి. ఇలా చేయడం వల్ల లక్షల రూపాయలని ఆదా చేసినవారు అవుతారు. మళ్లీ మీ కారు యధావిధిగా నడుస్తుంది.

Tags:    

Similar News