Best Cars 2024: నో డౌట్.. ఈ కార్లు ఆల్ టైమ్ బెస్ట్.. పిచ్చి పిచ్చిగా కొంటున్నారు..!

Best Cars 2024: 2024 సంవత్సరంలో హ్యుందాయ్, క్రెటా, టాటా పంచ్, మారుతి సుజికి వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ ఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ కార్లుగా ఉన్నాయి.

Update: 2024-08-31 07:49 GMT

Best Cars 2024

Best Cars 2024: ఇండియా ప్రపంచంలోరనే అతిపెద్ద కార్ మార్కెట్‌గా ఎదిగింది. స్వదేశీ, విదేశాలకు చెందిన అతిపెద్ద కంపెనీలు తమ కార్లరను విక్రయిస్తున్నాయి. కానీ దేశయ విపణిలో కొన్ని కార్లు మాత్రమే ఉన్నాయి. అవి పెద్ద సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. వాటిలో హ్యుందాయ్, క్రెటా, టాటా పంచ్, మారుతి సుజికి వ్యాగన్ ఆర్, మారుతి సుజికి స్విఫ్ట్, మారుతి సుజికి ఎర్టిగా ఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ కార్లుగా ఉన్నాయి. ఆకర్షణీయమైన డిజైన్‌లు, సరసమైన ధరలలో లభించే అద్భుతమైన ఫీచర్‌లతో కూడిన ఈ కార్లపై కస్టమర్‌లు పిచ్చిగా ఉన్నారు. మీరు కూడా కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ కార్ల ధర, ఫీచర్లను తెలుసుకుందాం.

టాటా పంచ్ 
టాటా పంచ్ కారు గురించి మాట్లాడితే ఈ మాక్రో SUV ధర రూ. 6.13 లక్షల నుండి రూ. 10.20 లక్షల వరకు ఎక్స్ షోరూమ్‌గా ఉంది. దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారు ఇదే. ఇది పెట్రోల్ CNG, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో లభిస్తుంది. మైలేజీ విషయానికి వస్తే ఇది లీటరుకు 18.8 నుండి 26.99 కిమీల మైలేజీని ఇస్తుంది. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 5 మంది కూడా ప్రయాణించవచ్చు.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
భారతదేశంలో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.54 లక్షల నుండి రూ. 7.33 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారులో 5 మంది కూర్చోవచ్చు,పెట్రోల్, CNG ఇంజన్లు ఉన్నాయి. ఇది 24.35 నుండి 33.47 kmpl వరకు మైలేజీని ఇస్తుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ 
మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 6.49 లక్షల నుండి రూ. 9.60 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో 1.2-లీటర్ 3-సిలిండర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది లీటరుకు 24.8 నుండి 25.72 కిమీల మైలేజీని ఇస్తుంది.

మారుతి సుజుకి ఎర్టిగా
మారుతి సుజుకి ఎర్టిగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 7 సీటర్ కారు. దీని ధర రూ. 8.69 లక్షల నుండి రూ. 13.03 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్య ఉంటుంది. ఇందులో పెట్రోల్, CNG ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి. ఇది లీటరుకు 20.3 నుండి 26.11 కిమీల మైలేజీని ఇస్తుంది.

హ్యుందాయ్ క్రెటా
ఇది ప్రముఖ SUV. దీని ధర రూ. 11 లక్షల నుండి రూ. 20.15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇందులో 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉంటుంది. వేరియంట్‌పై ఆధారపడి, హ్యుందాయ్ క్రెటా 17.4 నుండి 21.8 kmpl మైలేజీని ఇస్తుంది. హ్యుందాయ్ క్రెటా కారులో సులభంగా 5 మంది కూర్చోవచ్చు. ఈ కారులో అనేక అధునాతన ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇందులో మీకు 10.25 అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లే, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ ఏసీ వంటి ఫీచర్లు అందించబడ్డాయి. ప్రయాణీకుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) ఫీచర్స్ ఉన్నాయి.

Tags:    

Similar News