Hyundai New Electric SUV: 900 కిమీ రేంజ్‌తో కొత్త EV.. సింగిల్ ఛార్జ్‌తో హైదరాబాద్ - తమిళనాడు.. లాంచ్ ఎప్పుడంటే..?

Hyundai New Electric SUV: హ్యుందాయ్ 900 కిమీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ త్వరలో లాంచ్ చేయనుంది.

Update: 2024-08-30 06:38 GMT

Hyundai New Electric SUV

Hyundai New Electric SUV: ఇండియాలో హ్యుందాయ్ కంపెనీ కార్లకు మంచి డిమాండ్ ఉంది. వినియోగదారుల అభిరుచులకు తగట్టుగా లేటెస్ట్ ఫీచర్లను ప్రవేశపెడుతూ కంపెనీ దూసుకుపోతుంది. కార్ లవర్స్ కూడా హ్యుందాయ్ నుంచి కొత్త వెహికల్స్ ఎప్పుడొస్తాయని ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే కంపెనీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈవీ సెగ్మెంట్‌లో అత్యధిక రేంజ్ ఇచ్చే కారును విడుదల చేయనుంది. కంపెనీ ఇప్పుడు హై రేంజ్ ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి సారిస్తోంది. హ్యుందాయ్ వాహనాలను హైబ్రిడ్ మోడ్‌లో కూడా తీసుకురావడానికి వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

హ్యుందాయ్ మోటార్ ఇండియా రాబోయే సంవత్సరాల్లో అనేక కొత్త EVలను విడుదల చేయనుంది. కంపెనీ దృష్టి మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఉంది. నివేదికల ప్రకారం 2030 నాటికి 5.55 మిలియన్ కార్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యం. 5.55 మిలియన్ కార్లలో 2 మిలియన్ల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తులను చేర్చడం హ్యుందాయ్ లక్ష్యం.

నివేదికల ప్రకారం హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 900 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇవ్వగలదు. 2030 నాటికి 21 ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి విడుదల చేయాలన్నది కంపెనీ లక్ష్యం. దీనితో పాటు ఈ ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే బ్యాటరీల ధరను తగ్గించడంపై కూడా కంపెనీ శ్రద్ధ చూపుతోంది. అంటే ఈ సారి హ్యుందాయ్ EV సెగ్మెంట్‌లో తన పట్టును పటిష్టం చేసుకోవడానికి పూర్తిగా సిద్ధమైంది.

హ్యుందాయ్ భారతదేశంలో SUVలతో పాటు అనేక కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనుంది. మీడియా నివేదికల ప్రకారం అందులతో కోనా, ఐయోనిక్ 5 తర్వాత కంపెనీ దేశంలో మొట్టమొదటి మాస్ ఎలక్ట్రిక్ SUVని పరిచయం చేస్తుంది. కంపెనీ ముందుగా క్రెటా EVని లాంచ్ చేస్తుంది. ఇది కంపెనీ అతిపెద్ద లాంచ్ అవుతుంది. క్రెటా హిట్ అయితే కంపెనీ తదుపరి ప్రణాళికపై దృష్టి పెడుతుంది.

క్రెటా EV కాకుండా కంపెనీ ఇతర కొత్త మోడళ్లను దేశీయ మార్కెట్లో చూడవచ్చని సమాచారం క్రెటా EV ఉత్పత్తి ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు వచ్చే ఏడాది 2025లో భారత మార్కెట్లోకి రావచ్చు. తరచుగా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేని ఎలక్ట్రిక్ కారుపై హ్యుందాయ్ కసరత్తు చేస్తోంది. అంటే ఎక్కువ రేంజ్ ఉన్న ఈవీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. 

Tags:    

Similar News