Hyundai Alcazar Facelift Launch: స్టైలిష్ లుక్‌లో అల్కజార్.. బుకింగ్స్ షురూ..!

Hyundai Alcazar Facelift Launch: హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేసింది. దీని బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

Update: 2024-08-26 13:04 GMT

Hyundai Alcazar Facelift Launch

Hyundai Alcazar Facelift Launch:మీరు కొత్త SUVని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ అపారమైన విజయం సాధించిన తర్వాత కంపెనీ తన ప్రసిద్ధ SUV అల్కాజార్ అప్‌డేట్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో కంపెనీ హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ఫోటోలను గత వారం విడుదల చేసింది. అలాగే దాని బుకింగ్‌లను ప్రారంభించింది.

దీనికోసం డీలర్‌షిప్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో రూ. 25,000 టోకెన్ అమోంట్ చెల్లించాలి. అప్‌డేట్ చేయబడిన హ్యుందాయ్ అల్కాజర్ సెప్టెంబర్ 9న 6,7 సీటర్ వేరియంట్‌లలో విడుదల కానుంది. ఇది కాకుండా కొత్త హ్యుందాయ్ ఆల్కజార్ ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్ ప్లాటినం, సిగ్నేచర్ వంటి 4 గ్రేడ్‌లలో కొనుగోలు చేయవచ్చు. అప్‌డేట్ చేయబడిన అల్కాజార్ పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పులు చేయడం లేదు. రాబోయే SUV వేరియంట్, పవర్‌ట్రెయిన్, కలర్ ఆప్షన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

అప్‌డేట్ చేయబడిన హ్యుందాయ్ అల్కాజార్ వినియోగదారులకు 4 వేరియంట్‌లు, 9 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. రోబస్ట్ ఎమరాల్డ్ పెర్ల్ సరికొత్త కలర్ ఆప్షన్. అయితే ఇతర రంగు ఎంపికల్లో అబిస్ బ్లాక్ పెర్ల్, అట్లాస్ వైట్, ఫైరీ రెడ్, రేంజర్ ఖాకీ, స్టార్రీ నైట్, టైటాన్ గ్రే మ్యాట్ ఉన్నాయి. అయితే పెట్రోల్ మాన్యువల్, డీజిల్ మాన్యువల్ 3 వేరియంట్లలో ఎగ్జిక్యూటివ్ 7S, ప్లాటినం 7S, ప్రెస్టీజ్ 7Sలలో కొనుగోలు చేయవచ్చు. మరోవైపు పెట్రోల్ ఆటోమేటిక్, డీజిల్ ఆటోమేటిక్‌లను 4 ట్రిమ్‌లలో ప్లాటినం 6S, ప్లాటినం 7S, సిగ్నేచర్ 6S, సిగ్నేచర్ 7Sలలో కొనుగోలు చేయవచ్చు.

హ్యుందాయ్ అల్కాజార్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 160bhp పవర్, 253Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. అయితే SUV 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో అందించబడుతుంది, ఇది గరిష్టంగా 116bhp శక్తిని మరియు 250Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అదే సమయంలో ఫీచర్లుగా పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ కాకుండా SUV భద్రత కోసం 360 డిగ్రీ కెమెరా, ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2 ADAS టెక్నాలజీతో కూడా ఉంటుంది.

Tags:    

Similar News