Hyundai i20: ఐయ్యారే ఐ20.. నమ్మలేని డిస్కౌంట్స్.. ఫుల్లీ అప్‌డేట్స్‌తో వచ్చింది..!
Hyundai i20: హ్యందాయ్ తన ఫేమస్ హ్యాచ్‌బ్యాక్ i20పై భారీ ఆఫర్ ప్రకటించింది. రూ.50,000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.
Hyundai i20: దేశంలో ఎస్‌యూవీ సెగ్మెంట్ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతుంది. అలానే ఎక్కువ మంది కార్ లవర్స్ హ్యాచ్‌బ్యాక్ కార్లను కూడా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. వీటిలో మారుతీ స్విఫ్ట్, బాలెనో, టాటా ఆల్ట్రోజ్, టయోటా గ్లాంజా, హ్యుందాయ్ ఐ20 వంటి మోడళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మీరు కూడా కొత్త హ్యాచ్‌బ్యాక్ కారు కొనాలని చూస్తుంటే మీకో అదిరిపోయే శుభవార్త ఒకటి ఉంది. ఈ నెలలో హ్యందాయ్ తన ఫేమస్ హ్యాచ్‌బ్యాక్ i20పై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. కంపెనీ ఐ20 మాన్యువల్ వేరియంట్‌పై రూ.50,000, సీబీటీ వేరియంట్‌పై రూ.35000, ఎన్ లైన్ వేరియంట్‌పై రూ.35000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. డిస్కౌంట్ల గురించి మరిన్ని వివరాల కోసం సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.
హ్యుందాయ్ ఐ20 పవర్ ట్రెయిన్ గురించి మాట్లాడితే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది ఇది గరిష్టంగా 83bhp పవర్, 115Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇంతకుముందు కారులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండేది. కారు ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్, CBT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లింకై ఉంటుంది. హ్యుందాయ్ ఐ20 అనేది 5 సీటర్ హ్యాచ్‌బ్యాక్ కారు. ఇది ప్రస్తుతం వినియోగదారులకు 6 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
భారత మార్కెట్లో హ్యుందాయ్ ఐ20 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ.7.04 లక్షల నుండి రూ.11.21 లక్షల వరకు ఉంది.హ్యుందాయ్ i20 ఇంటీరియర్‌లో వినియోగదారులు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇది కాకుండా హ్యుందాయ్ ఈ హ్యాచ్‌బ్యాక్ కారులో కుటుంబ భద్రత కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌తో పాటు వెనుక పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, టాప్ వేరియంట్‌లో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లు కూడా అందించారు. హ్యుందాయ్ ఐ20 భారతీయ కస్టమర్లలో స్టైలిష్ ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్ కారుగా ప్రసిద్ధి చెందింది.