Car AC Tips: రాత్రంతా కారులో ఏసీ ఆన్ చేసి నిద్రపోతే ఎంత పెట్రోల్ ఖర్చవుతుందో తెలుసా?
Car AC Tips: మీరు కారులో నిద్రించవలసి వస్తే రాత్రిపూట ఏసీని నడపడం వల్ల ఎంత ఆయిల్ కాలిపోతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
Car Tips: చాలా మంది కార్లను ఎంతో వేగంగా నడుపుతుంటారు. కానీ, ఏసీ విషయానికి వచ్చే సరికి చాలా జాగ్రత్తగా వాగుడుతుంటారు. అవసరం లేకుంటే ఏసీ ఆఫ్‌లో ఉంచడం మంచిది. కానీ చాలా వేడిగా ఉంటే, ఏసీ ఆఫ్‌లో ఉంచడం వల్ల మీరే నష్టపోతారు. మీరు కారులో నిద్రించవలసి వస్తే రాత్రిపూట ఏసీని నడపడం వల్ల ఎంత ఆయిల్ కాలిపోతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఆలోచన మీ మనసులో ఎప్పుడూ రాలేదా.. ఈ రోజు దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
AC రన్నింగ్‌తో కారులో పడుకోవచ్చు. క్యాంపింగ్ చేసే వ్యక్తులు కూడా AC రన్నింగ్‌తో కారులో పడుకుంటారు. కాంపాక్ట్ SUV రాత్రిపూట ఎంత ఆయిల్ బర్న్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
6 గంటల పాటు ఏసీలో ఉంటే.. ఆయిల్ ఎంత కాలుతుంది.
దీనికి సంబంధించి ఓ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. అందులో కారు ఏసీని 6 గంటలు నడిపితే ఎంత ఆయిల్ కాలుతుందో తెలిపారు. వీడియో ప్రకారం, యజమాని కియా సెల్టోస్ SUV ఉంది. యజమాని నిద్రించడానికి కారు లోపల పరుపులు పెట్టాడు. రాత్రి 11 గంటలకు ఏసీ ఆన్ చేసి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు స్విచ్ ఆఫ్ చేశాడు. అంటే ఏసీ 6 గంటలపాటు కంటిన్యూగా నడిచింది.
యజమాని కారు ట్యాంక్‌ను రాత్రి పూట ఫుల్ చేశాడు. ఆయిల్ ఎంత కాలిపోయిందో తెలుసుకునేందుకు మరుసటి రోజు ఉదయం ట్యాంకును నింపాడు. కారు ట్యాంక్‌లో 3.02 లీటర్ల పెట్రోల్ పట్టింది. అంటే, దీనికి ఖర్చు రూ.265లు అయింది. అంటే రాత్రిపూట కారులో ఏసీని నడపాలని ఆలోచిస్తే, అప్పుడు ఖర్చు రూ.250-300 అవుతుంది. కారు ఎంత ఆయిల్ వినియోగిస్తుంది అనేది దాని ఇంజిన్ సామర్థ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది.