CNG Install: పాతకారులో సీఎన్‌జి ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా..!
CNG Install:పెరిగిన పెట్రోల్ ధరలని భరించలేకపోతున్నారా.. వెంటనే మీ కారులో సీఎన్‌జి కిట్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా..
CNG Install: పెరిగిన పెట్రోల్ ధరలని భరించలేకపోతున్నారా.. వెంటనే మీ కారులో సీఎన్‌జి కిట్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. వాస్తవానికి ఒక వ్యక్తి తన కారులో CNG కిట్‌ని ఇన్‌స్టాల్ చేయాలనుకున్నప్పుడు ముందుగా అతను ఏ కంపెనీ CNG కిట్‌ని తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. నిజానికి మార్కెట్లో ఉన్న కొన్ని పెద్ద CNG కిట్ బ్రాండ్లు ఉన్నాయి. అయితే దీనిని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం.
మార్కెట్లో అనేక CNG కిట్ బ్రాండ్లు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందనివి కూడా ఉన్నాయి. కానీ వీటిని ఇన్‌స్టాల్ చేసుకుంటే RTO నుంచి అనుమతి లభించదు. ఇప్పుడు కొన్ని పెద్ద CNG కిట్ బ్రాండ్‌ల గురించి మాట్లాడినట్లయితే BRC, లాండి-రెంజో, లోవాటో ఆటోగ్యాస్, యునిటాక్స్, SKN, టార్టరిని, టోమాసెట్టో, జావోలి, బెడ్నీ ఉన్నాయి. అయితే వివిధ బ్రాండ్‌ల CNG కిట్ ధర భిన్నంగా ఉంటుంది.
ఖర్చు గురించి మాట్లాడినట్లయితే 25 నుంచి 28 వేల రూపాయల వరకు అవుతుంది. మీరు మంచి CNG కిట్ కోసం 40 నుంచి 50 వేల రూపాయల వరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. వాస్తవానికి కోవిడ్ వచ్చినప్పటి నుంచి CNG సిలిండర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. అందుకే ప్రస్తుతం సీఎన్‌జీ కిట్‌ను అమర్చేందుకు అయ్యే ఖర్చు కాస్త పెరిగింది. CNG కిట్ అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే CNG పెట్రోల్ కంటే చౌకగా ఉంటుంది. ఎక్కువ మైలేజీని ఇస్తుంది. అతిపెద్ద ప్రతికూలత ఏంటంటే మెయింటనెన్స్ ఎక్కువగా ఉంటుంది. భద్రతా సమస్య కూడా ఉంటుంది.