Honda Elevate: లీటర్ పెట్రోల్‌తో 17 కి.మీల దూరం.. నేడు విడుదల కానున్న హెండా ఎలివేట్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Honda Elevate: జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా తన మొదటి మిడ్-సైజ్ SUV 'ఎలివేట్' ను ఈరోజు భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఈ ఏడాది జూన్ 6న కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది.
Honda Elevate: జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా తన మొదటి మిడ్-సైజ్ SUV 'ఎలివేట్' ను ఈరోజు భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఈ ఏడాది జూన్ 6న కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది. ఒక లీటర్ పెట్రోల్‌తో ఈ కారు 17 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
కారు ప్రారంభ ధర రూ. 11 లక్షలు(ఢిల్లీ ఎక్స్-షోరూమ్)గా పేర్కొంది. సెగ్మెంట్‌లో, ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్‌లతో పోటీపడుతుంది.
ఈ కారు ఫుల్ ట్యాంక్‌పై 679కిలోమీటర్లు పరిగెత్తగలదని
కంపెనీ జులై 25న ఎలివేట్ మైలేజీని వెల్లడించింది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 15.31kmpl అని ధృవీకరించింది. అయితే CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఇది ఒక లీటర్ పెట్రోల్‌లో 16.92kmpl రన్ అవుతుంది.
ఈ కారులో 40-లీటర్ల ఇంధన ట్యాంక్‌ను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. దీనితో, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడిన ఎలివేట్ ఫుల్ ట్యాంక్‌పై 612కి.మీ., ఆటోమేటిక్ వేరియంట్‌లో 679కి.మీ.ల దూరం వరకు ప్రయాణించగలదు. అంతకుముందు జులై 4న, కంపెనీ ఎలివేట్ వేరియంట్ వారీగా ఇంజన్ ఎంపికలు, రంగు ఎంపికలను ఆవిష్కరించింది. ఈ కారు 4 వేరియంట్‌లతో (SV, V, VX, ZX), 10 కలర్ ఆప్షన్‌లతో వస్తుంది.
జులై 3 నుంచి బుకింగ్ ప్రారంభం కాగా..
కంపెనీ జులై 3 నుంచి కారు బుకింగ్ ప్రారంభించింది. కొనుగోలుదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్, డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా రూ. 21,000 టోకెన్ మనీ చెల్లించి ఈ SUVని బుక్ చేసుకోవచ్చు. కారు డీలర్‌షిప్‌కి చేరుకుంది. టెస్ట్ డ్రైవ్ కూడా అందుబాటులో ఉంది. నేడు, ఎలివేట్ ధరల ప్రకటనతో, దాని డెలివరీ కూడా ప్రారంభమవుతుంది. దీని తర్వాత ఈ కారు గ్లోబల్ మార్కెట్‌లో విడుదల కానుంది.
హోండా ఎలివేట్: భద్రతా ఫీచర్లు..
హోండా ఎలివేట్ SUV లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ వాచ్, రియర్ సీట్ రిమైండర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హోండా సెన్స్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్‌తో వస్తుంది. SUV బాడీ హై టెన్సైల్ స్టీల్‌తో తయారు చేశారు. తద్వారా ప్రమాదం సమయంలో తక్కువ నష్టం ఉంటుంది.
Honda 2030 నాటికి 5 కొత్త SUVలను విడుదల చేసేందుకు సిద్ధం..
Honda 2030 నాటికి ఎలివేట్ ఎలక్ట్రిక్ వెర్షన్‌తో సహా ఐదు కొత్త SUVలను భారత మార్కెట్లోకి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ ఎలివేటర్ 2026 నాటికి వచ్చే అవకాశం ఉంది. హోండా వద్ద ఇంకా ఏ SUV లేదు. దీని కారణంగా కంపెనీ కూడా నష్టాలను చవిచూస్తోంది.
కంపెనీ తన చివరి SUV హోండా WR-V ఉత్పత్తిని ఈ సంవత్సరం ప్రారంభంలో నిలిపివేసింది. ఇంతకుముందు, కంపెనీ తన ఇతర రెండు SUV లు హోండా CR-V, BR-V లను కూడా నిలిపివేసింది.