Honda: కేవలం 6 నెలల్లోనే 30వేల అమ్మకాలు.. హోండా ఎలివేట్‌ దెబ్బకు రికార్డులు బ్రేక్.. ధర, ఫీచర్లు ఇవే..!

Honda Elevate: గత సంవత్సరం సెప్టెంబర్‌లో, హోండా కార్స్ ఇండియా ఎలివేట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది.

Update: 2024-03-25 05:42 GMT

Honda: కేవలం 6 నెలల్లోనే 30వేల అమ్మకాలు.. హోండా ఎలివేట్‌ దెబ్బకు రికార్డులు బ్రేక్.. ధర, ఫీచర్లు ఇవే..!

Honda Elevate: గత సంవత్సరం సెప్టెంబర్‌లో, హోండా కార్స్ ఇండియా ఎలివేట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు ప్రారంభించిన ఆరు నెలల్లోనే, ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ దేశంలో 30,000 యూనిట్ల అమ్మకాలను అధిగమించి కొత్త రికార్డును సృష్టించింది.

హోండా ఎలివేట్ SV, V, VX, ZX నాలుగు వేరియంట్లలో రూ. 11.58 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. హ్యుందాయ్ క్రెటాకు పోటీగా నిలిచే ఈ SUVలో 1.5-లీటర్ NA పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్, CVT గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇది 119bhp శక్తిని, 145Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ప్రస్తుతం, హోండా కార్స్ ఇండియాలో అమేజ్, సిటీ, ఎలివేట్ వంటి మూడు ఉత్పత్తులు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఎలివేట్ SUV ప్రారంభించినప్పటి నుంచి కార్ల తయారీ సంస్థ నెలవారీ దేశీయ విక్రయాలు, ఎగుమతులలో ఘననీయమైన వృద్ధిని సాధించింది. ఇంతలో, బ్రాండ్ ఇటీవలే జపాన్‌లో ఎలివేట్ రీబ్యాడ్జ్ వెర్షన్ అయిన WR-Vని విడుదల చేసింది.

Tags:    

Similar News