Honda Amaze vs Maruti Dzire: డిజైర్ లో లేనివి.. హోండా అమేజ్ లో ఉన్న 5 ఫీచర్లు.. ఏంటో తెలుసా ?

Honda Amaze vs Maruti Dzire: రీసెంట్ గా ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు హోండా కార్స్ ఇండియా తన కాంపాక్ట్ సెడాన్ అమేజ్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-07 10:04 GMT

Honda Amaze vs Maruti Dzire: డిజైర్ లో లేనివి.. హోండా అమేజ్ లో ఉన్న 5 ఫీచర్లు.. ఏంటో తెలుసా ?

Honda Amaze vs Maruti Dzire: రీసెంట్ గా ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు హోండా కార్స్ ఇండియా తన కాంపాక్ట్ సెడాన్ అమేజ్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి కొంత సమయానికి ముందు, మారుతి సుజుకి ఇండియా కూడా ఇదే విభాగంలో తన కొత్త అప్ డేటెడ్ డిజైర్‌ను లాంచ్ చేసింది. అయితే హోండా అమేజ్‌లో ఇలాంటి అనేక ఫీచర్లు కంపెనీ అందించిందో తెలుసుకుంటే దీనిని కొనుగోలు చేయడానికే మక్కువ చూపుతారు.

హోండా అమేజ్‌ను కంపెనీ మూడు ట్రిమ్‌లలో విడుదల చేసింది. దీని బేసిక్ వెర్షన్ ధర రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది. అయితే టాప్ మోడల్ ధర దాదాపు రూ. 13 లక్షల వరకు ఉంటుంది. కాగా మారుతి డిజైర్ బేసిక్ వర్షన్ ధర రూ.6.79 లక్షలు.

హోండా అమేజ్ 5స్పెషల్ ఫీచర్లు

కొత్త హోండా అమేజ్‌లో కంపెనీ కెమెరా ఆధారిత అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)ను అందించింది. ఈ విభాగంలోని ఏ కారులో లేని విధంగా ఇది మొదటిసారిగా ఈ కారులో హోండా అందించింది. కంపెనీ ఈ ఫీచర్ హోండా సెన్సింగ్‌లో పని చేస్తుంది. ఇది సేఫ్టీ పరంగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మాత్రమే కాదు, దీనితో హోండా అమేజ్ దేశంలో ADAS సూట్‌తో అత్యంత లగ్జరీ కారుగా అవతరించింది. ఈ విభాగంలోని ఏ కారులో లేనటువంటి మొదటిసారి ఫీచర్. అలాగే, కంపెనీ హోండా అమేజ్‌లో సైడ్ మిర్రర్‌తో కూడిన కెమెరాను అందించింది. వాహనాన్ని లేన్‌లో ఉంచడానికి ఈ కెమెరా పని చేస్తుంది, ఇది ఈ విభాగంలో ఏ కారులో లేనటువంటి ఫీచర్ ఇది కూడా.

ఇది మాత్రమే కాదు, హోండా అమేజ్‌లో 2.5 పీఎం కార్బన్ ఫిల్టర్, ప్యాడిల్ షిఫ్టర్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి సెగ్మెంట్‌లోని వాహనాల కంటే మరింత అధునాతనంగా ఉంటాయి. హోండా అమేజ్ లేదా మారుతి డిజైర్ పనితీరు విషయానికొస్తే, రెండు కార్లలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఒకే ఒక తేడా ఉంది. హోండా ఇంజిన్ 4 సిలిండర్లు, మారుతి ఇంజిన్ 3 సిలిండర్లు, ఇది హోండా అమేజ్ డ్రైవింగ్‌ను మరింత స్మూత్ గా చేస్తుంది.

అయితే మార్కెట్‌లో తన పట్టును కొనసాగించేందుకు మారుతి డిజైర్‌ గట్టిగా ప్రయత్నిస్తుందనే చెప్పాలి. దీనికి అతిపెద్ద పాయింట్ మైలేజ్. ఈ విషయంలో మారుతి డిజైర్ మళ్లీ మార్కెట్ ను గెలుస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో డిజైర్ పెట్రోల్ ఇంజన్ లీటరుకు 24.79 కిమీ మైలేజీని ఇస్తుంది. అయితే హోండా అమేజ్ లీటరుకు 18.65 కిమీ మైలేజ్ ఇస్తుంది. మారుతి డిజైర్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 5-స్టార్ BNCAP సేఫ్టీ రేటింగ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tags:    

Similar News