Hero Splendor Plus XTEC 2.0: లీటర్‌ పెట్రోల్‌తో 73కిమీల మైలేజీ.. మార్కెట్‌లో మంటలు పుట్టిస్తోన్న చౌకైన బైక్.. ధర, ఫీచర్లు చూస్తే కొనేస్తారంతే..!

Hero Splendor Plus XTEC 2.0: స్ప్లెండర్ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హీరో మోటోకార్ప్ కొత్త హీరో హీరో స్ప్లెండర్ ప్లస్‌ను విడుదల చేసింది.

Update: 2024-06-03 15:30 GMT

Hero Splendor Plus XTEC 2.0: లీటర్‌ పెట్రోల్‌తో 73కిమీల మైలేజీ.. మార్కెట్‌లో మంటలు పుట్టిస్తోన్న చౌకైన బైక్.. ధర, ఫీచర్లు చూస్తే కొనేస్తారంతే..!

Hero Splendor Plus XTEC 2.0: స్ప్లెండర్ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హీరో మోటోకార్ప్ కొత్త హీరో హీరో స్ప్లెండర్ ప్లస్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.82,911 (ఎక్స్-షోరూమ్)గా పేర్కొంది. ఈ బైక్ ప్రస్తుత మోడల్ కంటే రూ. 3,000 ఖరీదైనదిగా మారింది. ఈ బైక్ మ్యాట్ గ్రే, గ్లోస్ బ్లాక్, గ్లోస్ రెడ్ కలర్ మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. కొత్త స్ప్లెండర్ ప్లస్ హోండా షైన్ 100, బజాజ్ సీటీ 100, TVS Radeon లకు పోటీగా ఉంటుంది.

ప్రత్యేకత ఏమిటంటే..

కొన్ని చిన్న కాస్మెటిక్ అప్‌డేట్‌లు, అదనపు ఫీచర్లను మినహాయించి, Splendor Plus Xtec 2.0 సరిగ్గా పాత మోడల్‌లా కనిపిస్తుంది. ఇది స్క్వేర్ హెడ్‌ల్యాంప్‌తో అదే క్లాసిక్ డిజైన్‌ను పొందుతుంది. కానీ, ఇప్పుడు ఇది లోపల H-ఆకారపు DRLలతో LED యూనిట్‌తో వచ్చింది. ఇది LED హెడ్‌ల్యాంప్‌తో అందించే ఏకైక 100 సీసీ బైక్‌గా నిలిచింది. కలర్స్, గ్రాఫిక్స్ కూడా కొత్తవి, ఇండికేటర్ కూడా కొత్త డిజైన్ అందించారు.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

ఫీచర్ల గురించి మాట్లాడితే, బైక్ మైలేజీ గురించి సమాచారాన్ని అందించే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని కలిగి ఉంది. ఈ పవర్ ఫుల్ బైక్‌లో సైడ్-స్టాండ్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ ఇండికేటర్, కాల్, మెసేజ్ అలర్ట్‌లతో బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి అనేక ఫీచర్లను పొందుతారు. ఈ బైక్‌లోని వినియోగదారులకు హజార్డ్ లైట్ల కోసం ప్రత్యేక స్విచ్ కూడా అందించారు.

ఇంజిన్..

స్ప్లెండర్ ప్లస్ ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. i3s (ఐడిల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్) టెక్నాలజీని పొందుతుంది. దీని ఇంధన ట్యాంక్ కెపాసిటీ గురించి చెప్పాలంటే, ఇది 9.8. ఈ బైక్ లీటరుకు 73 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. అంటే, ఇది బడ్జెట్‌ ధరలోనే అద్బుతమైన మైలేజీ ఇవ్వగలదని తెలుస్తోంది.

Tags:    

Similar News