New Gen Hero Destini 125: హీరో నుంచి క్రేజీ స్కూటర్.. 59 కిమీ మైలేజ్.. రోడ్లపై దూకుడే..!
New Gen Hero Destini 125: హీరో అప్‌డేట్ చేసిన న్యూ జెన్ డెస్టినీ 125 ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది 59 కిమీ మైలేజ్ ఇస్తుంది.
New Gen Hero Destini 125: దేశంలోని ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీల్లో హీరో మోటోకార్ప్ కూడా ఒకటి. ఈ కంపెనీకి చెందిన బైక్‌లు, స్కూటర్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీ సరసమైన ధరలో లభించే హీరో డెస్టినీ 125 స్కూటర్‌కు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల కంపెనీ ఈ స్కూటర్ సెగ్మెంట్‌ను అప్‌డేట్ చేసి కొత్త జెన్ డెస్టినీ 125 ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. హీరో మోటోకార్ప్ ఇటీవలే కొత్త తరం డెస్టినీ 125 స్కూటర్ టీజర్‌ను విడుదల చేసింది. కంపెనీ తాజాగా విడుదల చేసిన టీజర్‌లో కొత్త హీరో డెస్టినీ లుక్ చాలా క్రేజీగా కనిపిస్తోంది. దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
న్యూ జెన్ హీరో డెస్టినీ 125 స్కూటర్ కొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్, పొడవైన సీటు అప్‌డేట్ చేయబడిన కొత్త పవర్ ఫుల్ ఇంజన్‌తో విడుదల చేయబడుతుంది. అయితే దీని ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. దీని ధర లక్ష రూపాయల లోపే ఉండే అవకాశం ఉంది. కొత్త హీరో డెస్టినీ 125 అనేక కొత్త ఫీచర్లతో రానుంది. భారతీయ మార్కెట్లో ఈ స్కూటర్ సుజుకి యాక్సెస్ 125, TVS జూపిటర్ 125, హోండా యాక్టివా 125 వంటి స్కూటర్లతో పోటీపడుతుంది. దీని డిజైన్ కూడా మునీపటి కంటే చాలా ఆకర్షణీయంగా ఉంది.
కొత్త హీరో డెస్టినీ 125 లుక్ చాలా అగ్రెస్సివ్ స్టైల్‌లో రూపొందించబడింది. ఇది ఇంటిగ్రేటెడ్ స్టైలిష్ DRLలతో ట్రెండింగ్ LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్ సెటప్‌ను కలిగి ఉంది. దీనితో పాటు మెటల్ ఫ్రంట్ ఫెండర్ కూడా ఉంటుంది. డెస్టినీ 125 ముందు ప్యానెల్‌లో స్టైలిష్ టర్న్ ఇండికేటర్‌లు అందించబడ్డాయి. అయితే వెనుక ప్యానెల్‌లో H- ఆకారపు LED బార్, అద్భుతమైన టెయిల్‌లైట్ ఉంటాయి. ఇది రైడర్, వెనుక ప్రయాణీకుల సౌలభ్యం కోసం బ్యాక్ సపోర్ట్ ప్యాడ్ బార్ సదుపాయాన్ని కలిగి ఉంది.
నివేదిక ప్రకారం కొత్త డెస్టినీ 125లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్ డిజిటల్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్, ఇల్యూమినేటెడ్ స్విచ్, బ్యాంక్ యాంగిల్ సెన్సార్, బూట్ ల్యాంప్, గ్లోవ్ బాక్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. డెస్టినీ తొలిసారిగా డిస్క్ బ్రేకులతో రాబోతోంది. దీనికి 12-అంగుళాల చక్రాలు ఉన్నాయి. దీని ఫ్రంట్ వీల్ 190ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.
సస్పెన్షన్ గురించి చెప్పాలంటే ఇది ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు షాక్ అబ్జర్వర్‌ని కలిగి ఉంది.2024 హీరో డెస్టినీ 125 శక్తివంతమైన 125cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 9 హెచ్‌పి పవర్, 10.4 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. నివేదిక ప్రకారం కొత్త స్కూటర్ 59kmpl మైలేజీని ఇస్తుంది.