Most Powerfull Car: రోడ్డుపై నడిచే విమానం.. ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ కార్.. ధర తెలిస్తే మార్ఛపోవాల్సిందే..!

Most Powerfull Car: ప్రపంచంలో చాలా కార్లు తయారవుతున్నాయి. కొందరు హైస్పీడ్ కార్లను కలిగి ఉంటే, మరికొందరు అద్భుతమైన మైలేజీ కలిగిన కార్లను తీసుకుంటుంటారు.

Update: 2024-09-12 15:30 GMT

Most Powerfull Car: రోడ్డుపై నడిచే విమానం.. ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ కార్.. ధర తెలిస్తే మార్ఛపోవాల్సిందే..!

Most Powerfull Car: ప్రపంచంలో చాలా కార్లు తయారవుతున్నాయి. కొందరు హైస్పీడ్ కార్లను కలిగి ఉంటే, మరికొందరు అద్భుతమైన మైలేజీ కలిగిన కార్లను తీసుకుంటుంటారు. ఇప్పుడు చెప్పబోయే కార్ మాత్రం అంతకు రెట్టింపు ప్రయోజనాలతో ఫిదా చేస్తోంది.

ఈ కారును అమెరికాకు చెందిన హైపర్ కార్ల తయారీ కంపెనీ హెన్నెస్సీ స్పెషల్ వెహికల్స్ తయారు చేసింది. కారు రూపకల్పన నుంచి దాని శక్తి, ఇతర ఫీచర్ల వరకు, కంపెనీ చాలా ఎంతో అద్భుతంగా నిర్మించింది. భూమిపై ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కారు ఇదేనని కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రధాన కార్యాలయం టెక్సాస్‌లో ఉంది.

హెన్నెస్సీ వెనమ్ F5-M రోడ్‌స్టర్ కారు పైకప్పు ఒక ఫైటర్ జెట్ లాగా పైకి తెరుచుకుంటుంది. ఒక వ్యక్తికి మాత్రమే సీటింగ్ స్థలం ఉంది. కారు డిజైన్ పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో రూపొందించారు. డ్రైవింగ్ అనుభవాన్ని సంచలనాత్మకంగా మార్చడమే కంపెనీ లక్ష్యం.

మీరు టామ్ క్రూజ్ టాప్ గన్ మూవీని తప్పకుండా చూసి ఉంటారు. ఈ కారులో డ్రైవర్ క్యాబిన్ పూర్తిగా ఈ టాప్ గన్ నుంచి ప్రేరణ పొందింది. ఈసారి కంపెనీ ఎలక్ట్రానిక్‌కు బదులుగా ఫిజికల్ ట్రాన్స్‌మిషన్‌పై దృష్టి పెట్టింది.

ఇక పవర్ గురించి మాట్లాడితే, కంపెనీ 6 ట్రాన్స్మిషన్ ఫ్యూరీ V8 ఇంజిన్ను అందించింది. దీని శక్తి 1,817 bhp. డబుల్ డెక్కర్ ట్రక్ ఇంజిన్ సగటున 600 BHP శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ విషయంలో, ఈ కారు ట్రక్ కంటే మూడు రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. అలాగే, వేగం గురించి మాట్లాడితే, ఈ కారు కేవలం కొన్ని సెకన్లలో గంటకు 357 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

కంపెనీ వ్యవస్థాపకుడు, CEO జాన్ హెన్నెస్సీ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మాన్యువల్ కారును అందించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ప్రస్తుతం 12 కార్లు మాత్రమే తయారవుతున్నాయి. త్వరలో మరిన్ని కార్లు తయారు చేస్తామని తెలిపారు. కాగా, ఈ కారు ధర దాదాపు రూ.25 కోట్లు ఉంటుందని సమాచారం.

గాలి నిరోధకతను తగ్గించడానికి, కారులో 55-అంగుళాల ఫిన్ కూడా అమర్చారు. ఇది ఫైటర్ జెట్ రూపాన్ని ఇస్తుంది. కారు కాక్‌పిట్ అల్యూమినియం, కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. తద్వారా ఇది బలంగా ఇంకా తేలికగా ఉంటుంది. ఇటువంటి మెటీరియల్ గేర్ నాబ్‌పై ఉపయోగిస్తుంటారు.

ఈ కారు డిజైన్, ఇంజన్ అన్నీ టెక్సాస్‌లోని సాలిలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో తయారు చేస్తున్నారు. ఇంతకుముందు, హెన్నెస్సీ సెమీ-ఆటో ఇంజన్‌తో వెనమ్ ఎఫ్5 కూపే కారును విడుదల చేసింది.

ఒక్కో కారు ఓనర్‌కు ఒక్కో రంగును ఇస్తారని, కారు రంగును తయారు చేసిన తర్వాత దానిని సిస్టమ్ నుంచి తొలగిస్తామని కంపెనీ తెలిపింది. దీన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ప్రపంచంలోని ఏ మూల నుంచి అయినా HennesseySpecialVehicles.comని సందర్శించడం ద్వారా తమ ఆర్డర్‌లను పూర్తి చేసుకోవచ్చని తెలుస్తోంది.

Tags:    

Similar News