Electric Car Care: మీరు ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేశారా.. చల్లటి వాతావరణంలో ఈ చిట్కాలు పాటించండి..!

Electric Car Care: ఇంధన ధరలు పెరగడంతో దేశంలో చాలామంది ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్‌లో వీటి కొనుగోళ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి.

Update: 2024-02-01 12:30 GMT

Electric Car Care: మీరు ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేశారా.. చల్లటి వాతావరణంలో ఈ చిట్కాలు పాటించండి..!

Electric Car Care: ఇంధన ధరలు పెరగడంతో దేశంలో చాలామంది ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్‌లో వీటి కొనుగోళ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. వీటివల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం ఉండదు. అంతేకాకుండా ఇంధన ఖర్చు కూడా ఉండదు. కేవలం తక్కువ ఖర్చులో వేల కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అయితే ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనడం కాదు వాటి మెయింటెనెన్స్‌ అనేది చాలా ముఖ్యం. లేదంటే తొందరగా బ్యాటరీ సామర్థ్యం దెబ్బతింటుంది. దీనవల్ల అవి పనిచేయకుండా మారుతాయి. చలికాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు కండీషన్‌లో ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

చలికాలంలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను ఆరుబయట పార్కింగ్‌ చేయవద్దు

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో లిథియం-అయాన్ బ్యాటరీలు శక్తిని స్టోర్‌ చేస్తాయి. ఇవి వెహికల్‌కి శక్తినిస్తాయి. అయితే లిథియం-అయాన్ బ్యాటరీలు తక్కువ ఉష్ణోగ్రతలలో తొందరగా దెబ్బతింటాయి. వేగంగా డ్రెయిన్ అవుతాయి. రీఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీన్ని నివారించడానికి వీలైతే ఎలక్ట్రిక్ కారును ఆరుబయట పార్క్ చేయవద్దు. చలిని నివారించడానికి రాత్రిపూట దానిని కవర్ చేయాలి.

ఛార్జింగ్ చేస్తున్నప్పుడు క్యాబిన్‌ను హీట్ చేయాలి

చలికాలంలో బ్యాటరీ సామర్థ్యం తగ్గకుండా ఉండేందుకు కారు ఛార్జర్‌ను ప్లగ్ చేస్తున్నప్పుడు క్యాబిన్‌ను ముందుగా హీట్‌ చేయాలి. దీనివల్ల ఛార్జింగ్‌ అయ్యేటప్పుడు బ్యాటరీకి ఎఫెక్ట్‌ పడకుండా ఉంటుంది. వేడివల్ల సులువుగా ఛార్జ్‌ అవుతుంది.

ఫాస్ట్ ఛార్జర్ వినియోగాన్ని తగ్గించండి

తరచుగా ఫాస్ట్ ఛార్జింగ్ లిథియం-అయాన్ బ్యాటరీలకు మంచిది కాదు. చల్లని వాతావరణంలో ఇది మరింత హానికరం. ఉష్ణోగ్రతలో తగ్గుదల కారణంగా బ్యాటరీ పై చెడు ప్రభావం పడుతుంది. శీతాకాలంలో వీలైనంత వేగంగా ఛార్జింగ్ చేయడాన్ని నివారించండి. ఫాస్ట్ ఛార్జర్‌ను సుదీర్ఘ రన్ తర్వాత లేదా బ్యాటరీ బాగా వేడెక్కినప్పుడు ఉపయోగించవచ్చు.

పునరుత్పత్తి బ్రేకింగ్ ఉపయోగించండి

చలి కారణంగా బ్యాటరీ ఛార్జింగ్‌ తగ్గిపోతున్నప్పుడు బ్రేక్స్‌ వేయడం పెంచాలి. దీనివల్ల బ్రేకింగ్ నుంచి విడుదలయ్యే శక్తి బ్యాటరీలో స్టోర్‌ అవుతుంది. ఇది బ్యాటరీ పరిధిని మరింత పెంచుతుంది.

బ్యాటరీ 20 శాతం కంటే తక్కువకు తీసుకురావొద్దు

కారు బ్యాటరీ 20% కంటే తక్కువకు తీసుకురావొద్దు. చల్లని వాతావరణంలో ఇలా అస్సలు చేయకూడదు. ఇంతకంటే బ్యాటరీని డ్రైన్ చేయడం వల్ల దాని రివర్స్ సైకిల్ దెబ్బతింటుంది. దీని వల్ల బ్యాటరీ క్రమంగా ఛార్జింగ్ సామర్థ్యాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా చల్లని వాతావరణంలో అలా చేయడం వల్ల బ్యాటరీ తొందరగా దెబ్బతింటుంది.

Tags:    

Similar News