Electric Scooter Offer: 50శాతం డిస్కౌంట్‎తో ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.1,333కే ఇంటికి తీసుకెళ్లండి..!

Electric Scooter Offer: మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే దానికోసం వెతుకుతున్నారా... అయితే ఈ స్కూటర్‌ని ఎంపిక చేసుకోవచ్చు.

Update: 2024-11-15 08:15 GMT

Green Udaan Electric Scooter

Electric Scooter Offer: మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే దానికోసం వెతుకుతున్నారా... అయితే ఈ స్కూటర్‌ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ స్కూటర్ కొన్నవాళ్లంతా బాగుందని కితాబిస్తున్నారు. ఆ స్కూటర్ ఏంటో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఇది Green Udaan కంపెనీ తయారుచేసిన ఎలక్ట్రిక్ స్కూటర్. దీనికి చిన్న రీఛార్జ్ బ్యాటరీ ఉంటుంది. దాన్ని బయటకు కూడా తీసుకోవచ్చు. అందువల్ల బ్యాటరీని పట్టుకెళ్లి, ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లే కాబట్టి.. రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఈ స్కూటర్ బ్యాటరీని ఒకసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే.. 30 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. దీనికి 250వాట్స్ మోటారు ఉంటుంది. అలాగే సౌకర్యవంతమైన వైడర్ డెక్ ఉంది.

ఈ స్కూటర్ బడ్జెట్ ఫ్రెండ్లీ రైడింగ్ అంటున్నారు. తేలిగ్గా ఉంటుంది, ట్రాఫిక్‌లో ఈజీగా ప్రయాణం చేస్తుంది. ఎంతో పరిశోధన చేసి, దీన్ని భారతీయ రోడ్లకు తగ్గట్లుగా తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. దీనికి పవర్ ఫుల్ మోటర్‌కి తోడు.. 10 అంగుళాల చక్రాలను అందించారు. దీంతో గతుకుల రోడ్లపై కూడా ఈ స్కూటర్ సాఫీగా ప్రయాణం చేస్తుంది. దీని ప్యూమాటిక్ టైర్లు గట్టిగా ఉంటాయనీ, గతుకుల రోడ్లపై సాఫీగా వెళ్తాయని తెలిపారు. ఈ స్కూటీపై ఇద్దరు ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ స్కూటర్‌కి ముందు, వెనక కూడా సస్పెన్షన్స్ ఇచ్చారు. అందువల్ల గతుకుల రోడ్లపై నడుం నొప్పి ఉండదని అనుకోవచ్చు. ఈ స్కూటర్‌కి పెడల్ సిస్టం కూడా ఉంది. ఎక్కడైనా బ్యాటరీ అయిపోతే, పెడల్స్ తొక్కుకుంటూ వెళ్లిపోవచ్చు.

ఈ స్కూటర్ సీట్లను మన ఎత్తుకి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని బ్యాటరీ ఫుల్‌గా ఛార్జ్ అవ్వడానికి 4 నుంచి 6 గంటలు పడుతుంది. వెహికిల్ నుంచి తియ్యవచ్చు. ఇంట్లో రెగ్యులర్ ప్లగ్ ద్వారానే చార్జింగ్ చేసుకోవచ్చు. రాత్రి పెడితే.. తెల్లారి వాడుకోవచ్చని సూచించారు. ఈ స్కూటర్‌ని డెలివరీ చేశాక.. దీని పార్టులను చాలా ఈజీగా బిగించుకోవచ్చనీ, ఇందుకు అవసరమైన పనిముట్లు కూడా ఇస్తామని కంపెనీ చెబుతుంది. అలాగే.. వాట్సాప్ సర్వీస్ కూడా ఉందని తెలిపారు. వీడియో ద్వారా.. డెమో కూడా ఇస్తామన్నారు. ఈ స్కూటర్‌కి 180 రోజుల వారంటీ ఉంది. ఇందులో తయారీ సమస్యలు, లోపాలు ఉంటే.. సరిచేస్తామని తెలిపారు. కస్టమర్ సర్వీస్ టీమ్ కూడా.. 48 గంటల్లో అందుబాటులోకి వస్తుందని కంపెనీ చెప్పుకొచ్చింది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి మైలేజీ ఖర్చు 1 కిలోమీటర్‌కి 20 పైసలు మాత్రమే అవుతుందని తెలిపారు. అంటే.. 5 కిలోమీటర్లకు 1 రూపాయి ఖర్చవుతుంది. 100 కిలోమీటర్లకు రూ.20 మాత్రమే ఖర్చవుతుంది. అదే.. పెట్రోల్ బైక్ అయితే.. 100 కిలోమీటర్లకు రూ.200కి పైగా ఖర్చవుతుంది. దీని అసలు ధర రూ.54,000 కాగా.. అమెజాన్‌లో 49 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.27,499కి విక్రయిస్తున్నారు. దీన్ని ఈఎంఐలో రూ.1,333కి పొందవచ్చు. నవంబర్ 23 నుంచి 26 మధ్య బుక్ చేస్తే.. ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఈ స్కూటీకి 3.8/5 రేటింగ్ ఉంది. దీన్ని కొన్నవారు ఫొటోలు, రివ్యూలూ ఇస్తున్నారు.

Tags:    

Similar News