Luxury Cars in India: ఫీచర్లలో అదరహో.. సేఫ్టీలో నంబర్ వన్.. ఈ లగ్జరీ కార్ల ధరలు చూస్తే మూర్ఛపోతారంతే..!
Luxury Cars in India: లగ్జరీ కార్లు ఎల్లప్పుడూ కళ్లు చెదిరే ఫీచర్లతో ప్రజలను ఆకట్టుకుంటాయి. చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు ఈ ఖరీదైన కార్లలో ప్రయాణిస్తూ కనిపిస్తారు.
Luxury Cars in India: లగ్జరీ కార్లు ఎల్లప్పుడూ కళ్లు చెదిరే ఫీచర్లతో ప్రజలను ఆకట్టుకుంటాయి. చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు ఈ ఖరీదైన కార్లలో ప్రయాణిస్తూ కనిపిస్తారు. లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు అద్భుతమైన లగ్జరీ కార్ల గురించి తెలుసుకుందాం.
లగ్జరీ కార్ల జాబితాలో టయోటా ఫార్చ్యూనర్ కూడా చేరింది. ఈ కారులో 2.8-లీటర్ ఇంజన్ ఉంది. ఈ కారు 500 Nm టార్క్, 204 PS పవర్ ఇస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 33.43 లక్షల నుంచి మొదలై రూ. 51.44 లక్షల వరకు ఉంటుంది.
కార్ల తయారీదారు టయోటా మరొక మోడల్ ఈ జాబితాలో చేరింది. టయోటా ల్యాండ్ క్రూయిజర్‌లో ఆఫ్-రోడింగ్, పార్కింగ్‌లో సౌలభ్యం కోసం మల్టీ టెర్రైన్ మానిటర్ అమర్చబడింది. ఈ కారులో లగ్జరీతో పాటు భద్రతపై కూడా దృష్టి పెట్టారు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.2.10 కోట్లుగా నిలిచింది.
కియా EV6 ఒక గొప్ప ఎలక్ట్రిక్ కారు. ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 708 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ కారును 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు 5.2 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు. Kia EV 6 ఎక్స్-షోరూమ్ ధర రూ. 60.95 లక్షల నుంచి మొదలై రూ. 65.95 లక్షల వరకు ఉంటుంది.
దేశంలోని చాలా మంది పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ల్యాండ్ రోవర్ వాహనాల్లో ప్రయాణిస్తూ కనిపిస్తారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ అత్యంత లగ్జరీ కారులో చేరింది. ఈ ఆటోమేటిక్ కారులో 2996.0 సీసీ ఇంజన్ కలదు. దీని బహుళ వేరియంట్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 93.55 లక్షల నుంచి మొదలై రూ. 2.3 కోట్ల వరకు ఉంటుంది.
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ విలాసవంతమైన వాహనాలలో ఒకటి. ఇందులో 4395 సీసీ ఇంజన్ కలదు. ఈ కారు EV మోడల్ కూడా మార్కెట్లోకి వచ్చింది. దీని ఎలక్ట్రిక్ హైబ్రిడ్ మోడల్ పనితీరును మరింత మెరుగ్గా చేసింది. ఈ లగ్జరీ కారు అత్యంత ఖరీదైన వాహనాలలో చేర్చబడింది. ఈ వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.39 కోట్ల నుంచి మొదలై రూ. 4.17 కోట్ల వరకు ఉంటుంది.