Tata Cars: గేర్ మార్చే అవసరమే లేదు.. దేశంలోనే తొలిసారి కొత్త ఫీచర్‌తో రానున్న రెండు టాటా కార్లు.. అదేంటంటే?
Tata Motors Cars: టాటా మోటార్స్ టాటా టియాగో, టాటా టిగోర్ CNG AMT వేరియంట్‌లను విడుదల చేయబోతోంది. ఆ సంస్థ తన టీజర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది.
Tata Motors: టాటా మోటార్స్ గత కొన్ని సంవత్సరాలుగా తన కొత్త కార్లు, టెక్నాలజీతో చాలా మంది కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇప్పుడు కంపెనీ భారతదేశపు మొట్టమొదటి CNG AMT కారును విడుదల చేయబోతోంది. టాటా టియాగో(Tata Tiago), టాటా టిగోర్ (Tata Tigor) భారతదేశపు మొట్టమొదటి CNG AMT కార్లు. ఈ రెండు వేరియంట్‌ల టీజర్‌లను కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేసింది. కంపెనీ త్వరలో ఈ వేరియంట్‌లను విడుదల చేయనుంది. టాటా టిగోర్, టాటా టియాగో CNG వేరియంట్‌లు ప్రస్తుతం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, CNG ఎంపికలు రెండింటిలోనూ అమలు చేయగలవు.
భారతదేశంలో ఈ టెక్నాలజీని తీసుకొచ్చిన మొదటి కంపెనీగా టాటా..
CNG AMT వేరియంట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, ఈ టాటా వాహనాల పట్ల వినియోగదారుల ఆకర్షణ మరింత పెరుగుతుంది. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ కంపెనీ ఈ టెక్నాలజీని తీసుకురాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా, టాటా టియాగో, టాటా టిగోర్ ప్యాసింజర్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ అమ్మకాలను పెంచడంలో చాలా దోహదపడ్డాయి.
Tiago CNG ధర ఎంత?
ఏడు వేరియంట్‌లతో వస్తున్న టియాగో సీఎన్‌జీ ధర రూ.6.55 లక్షల నుంచి రూ.8.10 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. మరోవైపు, టాటా టిగోర్ CNG 4 వేరియంట్లలో వస్తుంది. దీని ధర రూ. 7.80 లక్షల నుంచి రూ. 8.95 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. టాటా టియాగో, టిగోర్ CNG ఆటోమేటిక్ వేరియంట్‌లు అదే ఫీచర్లతో వస్తాయని భావిస్తున్నారు. దీని తరువాత, ఈ సాంకేతికత Altroz CNGలో కూడా రావచ్చు. ఈ టాటా కారు పెట్రోల్-CNG బై-ఫ్యూయల్ టెక్నాలజీతో కూడా వస్తుంది.
ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న ధరలు..
టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ కార్ల ధరలను ఫిబ్రవరి 1 నుంచి పెంచబోతోంది. ఈ కార్ల ధరలు సగటున 0.7 శాతం మేర పెరగనున్నాయి. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కావాలంటే జనవరి 31 వరకు పాత ధరలకే టాటా కార్లను కొనుగోలు చేయవచ్చు.