Best Mileage Electric Cars: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కి.మీ.ల దూరం.. ధర మీ బడ్జెట్‌లోనే.. చౌకైన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!

Best Electric Cars in India: మీరు పెట్రోల్-డీజిల్‌కు బదులుగా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే 5 గొప్ప ఎంపికలను అందించబోతున్నాం. భారతదేశానికి చెందిన ఈ 5 ఎలక్ట్రిక్ కార్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలవు.

Update: 2023-09-10 16:00 GMT

Best Mileage Electric Cars: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కి.మీ.ల దూరం.. ధర మీ బడ్జెట్‌లోనే.. చౌకైన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!

Affordable Electric Cars In India: పెట్రోల్, డీజిల్, CNG ధరలు నిరంతరంగా పెరగడం, ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం వల్ల, గత కొన్ని రోజులుగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పుంజుకున్నాయి. ఇప్పుడు కారు కొనాలనుకునే ప్రతి వ్యక్తి పెట్రోల్, డీజిల్‌కు బదులుగా ఎలక్ట్రిక్ కార్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు కూడా కుటుంబం కోసం కొత్త కారు కోసం చూస్తున్నట్లయితే, ఈ రోజు మేం దేశంలోని టాప్ 5 సరసమైన ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని మీరు మీ బడ్జెట్‌లో ఉంటూ సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఆ 5 కార్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశంలోని టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు..

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్..

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు 39.2kWh బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ కేవలం 57 నిమిషాల్లో అంటే సుమారు గంటలో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దాదాపు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ కారు ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 452 కి.మీల వరకు దూసుకపోతోంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.24 లక్షలు. మీరు ఈ కారును ఈఎంఐల పద్ధతిలో కూడా కొనుగోలు చేయవచ్చు.

టాటా నెక్సన్ EV..

మీరు టాటా నెక్సాన్ EV కారును కూడా కొనుగోలు చేయోచ్చు. ఇది 141 HP పవర్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 250 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే, ఈ కారు నాన్‌స్టాప్‌గా 312 కిమీల దూరం ప్రయాణించగలదు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 15 లక్షలు. ఈ కారును కొనుగోలు చేయడం ద్వారా మీరు చాలా ఆదా చేసుకోవచ్చు.

టాటా టియాగో EV..

టాటా టియాగో EV రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 250 కి.మీ నుంచి 315 కి.మీ. ఈ కారులో హోమ్ ఛార్జింగ్‌తో పాటు, DC ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా అందించబడింది. ఈ కారు బ్యాటరీ కేవలం 57 నిమిషాల్లో 80 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ చేయబడుతుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.8.49 లక్షలు. రూ.21 వేలు చెల్లించి కూడా ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

మహీంద్రా XUV400..

మహీంద్రా XUV400లో ఇవ్వబడిన బ్యాటరీ 310Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 34.5kWh బ్యాటరీ ప్యాక్‌తో దాదాపు 375 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. రెండవ బ్యాటరీతో ఇది 456 కి.మీ దూరం వరకు వెళ్లగలదు. మీరు ఈ కారును రూ. 15.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో పొందవచ్చు. రూ.21 వేలు చెల్లించి మీ కోసం బుక్ చేసుకోవచ్చు.

MG ZS EV..

MG ZS EV ఈ ఎలక్ట్రిక్ కారు 176 PS శక్తిని, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కారు 50.3kWh అధిక వోల్టేజ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ కెపాసిటీ చాలా ఎక్కువ కాబట్టి ఇది ఒక గంటలో 80 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే, ఈ కారు 461 కి.మీ.ల దూరం వెళ్తుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.22.98 లక్షలు.

Tags:    

Similar News