Upcoming SUV: కొత్త ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.. దేశంలో ఎంట్రీ ఇవ్వబోతున్న 6 కార్లు.. లిస్ట్ చూస్తే వావ్ అంటారంతే..!

Upcoming Compact SUV: కార్ల పరంగా SUVలు ఇప్పుడు ప్రజల మొదటి ఎంపికగా మారుతున్నాయి. భారతదేశంలో SUVల మార్కెట్ వాటా 50% కంటే ఎక్కువ పెరిగింది.

Update: 2024-05-14 05:45 GMT

Upcoming SUV: కొత్త ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.. దేశంలో ఎంట్రీ ఇవ్వబోతున్న 6 కార్లు.. లిస్ట్ చూస్తే వావ్ అంటారంతే..!

Upcoming Compact SUV: కార్ల పరంగా SUVలు ఇప్పుడు ప్రజల మొదటి ఎంపికగా మారుతున్నాయి. భారతదేశంలో SUVల మార్కెట్ వాటా 50% కంటే ఎక్కువ పెరిగింది. కార్ కంపెనీలు కూడా మరిన్ని ఎస్‌యూవీలను విడుదల చేయడంపై దృష్టి సారించాయి. ఇప్పుడు రాబోయే కాలంలో కనీసం 6 కొత్త కాంపాక్ట్ SUVలు విడుదల కానున్నాయి.

టాటా నెక్సాన్ CNG..

టాటా నెక్సాన్ CNG 2024 ద్వితీయార్ధంలో అమ్మకానికి అందుబాటులోకి రావచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ షోలో ఈ మోడల్ కనిపించింది. ఇది దేశంలోనే మొట్టమొదటి టర్బోచార్జ్డ్ CNG కారు. CNG వెర్షన్ డిజైన్ ఖచ్చితంగా దాని ICE వెర్షన్ లాగా ఉంటుంది.

అప్‌డేట్ చేసిన నిస్సాన్ మాగ్నైట్..

భారతదేశంలో నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత, నిస్సాన్ మాగ్నైట్ సబ్‌కాంపాక్ట్ SUV ఇప్పుడు 2024 చివరిలో మిడ్-లైఫ్ అప్‌డేట్‌ను పొందుతుందని భావిస్తున్నారు. ఇంజన్ సెటప్ అలాగే ఉంటుంది, దాని బాహ్య, లోపలి భాగంలో చిన్న మార్పులు చేయవచ్చు.

కియా సిరోస్/క్లావిస్..

కియా రాబోయే కొత్త మైక్రో SUVకి 'సిరోస్' లేదా 'క్లావిస్' అని పేరు పెట్టే అవకాశం ఉంది. ఇది హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా పంచ్, మారుతి సుజుకి సుజుకి బ్రోంక్స్‌లకు పోటీగా ఉంటుంది. ఈ మోడల్ పొడవైన స్టాన్స్, హై గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. నిలువుగా ఉంచిన LED హెడ్‌ల్యాంప్‌లను ఇందులో చూడవచ్చు.

స్కోడా, వోక్స్‌వ్యాగన్ SUV..

స్కోడా, వోక్స్‌వ్యాగన్ సబ్-4 కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి. కొత్త స్కోడా కాంపాక్ట్ SUVని మార్చి 2025 నాటికి విడుదల చేయవచ్చు. ప్రస్తుతం ఇది పరీక్ష దశలో ఉంది. దీని ప్రొడక్షన్-రెడీ వెర్షన్‌ను 2025 భారత్ మొబిలిటీ షోలో ప్రదర్శించవచ్చని భావిస్తున్నారు.

2025 హ్యుందాయ్ వెన్యూ..

హ్యుందాయ్ వెన్యూ వచ్చే ఏడాది (2025) రెండవ తరానికి చేరుకోనుంది. దీని కోడ్‌నేమ్ ప్రాజెక్ట్ Q2Xi అని చెబుతున్నారు. 2025 హ్యుందాయ్ వెన్యూ (ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే) డిజైన్, ఇంటీరియర్‌లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News