Top Bikes: రూ.2 లక్షల లోపు బైక్ కావాలా? ఇదిగో అద్భుతమైన 5 ఎంపికలు.. ఫీచర్లు చూస్తే, అప్పుచేసైనా కొనేస్తారంతే..!
Bikes Under Rs. 2 Lakh: భారీ బైక్‌లకు మార్కెట్‌లో క్రేజ్ పెరుగుతోంది.
Bikes Under Rs. 2 Lakh: భారీ బైక్‌లకు మార్కెట్‌లో క్రేజ్ పెరుగుతోంది. మీరు కూడా ఇలాంటి బైక్ కోసం వెతుకుతున్నట్లయితే, మీకు రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల బడ్జెట్ ఉంటే, మీ కోసం 5 బైక్‌లను తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు చూద్దాం..
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350: ఇది 3 వేరియంట్లు, 10 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ రోడ్‌స్టర్ బైక్ 349.34cc, BS6 ఇంజిన్‌తో వస్తుంది. ఇది 20.2 bhp/27 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బైక్‌కు ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇందులో సింగిల్ ఛానల్ ABS కూడా ఉంది. దీని ధర రూ. 1.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
బజాజ్ NS200: ఇది నేక్డ్ డిజైన్ బైక్, ఇందులో 199.5cc BS-6 ఇంజన్ ఉంది. దీని ఇంజన్ 24.13 bhp/18.74 Nm అవుట్‌పుట్ ఇస్తుంది. ఇది ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. దీని ధర రూ. 1.42 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
TVS రోనిన్: ఇది చాలా స్టైలిష్, కండలు తిరిగింది. బైక్ 4 వేరియంట్‌లు, 7 కలర్ ఆప్షన్లలో వస్తుంది. దీని 225.9cc, BS-6 ఇంజన్ 20.1 bhp/19.93 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది డ్యూయల్ ఛానల్ యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) తో వస్తుంది. దీని ధర రూ. 1.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
TVS Apache RTR 200 4V: దీని ధర రూ. 1.42 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 2 వేరియంట్‌లు, 3 కలర్ ఆప్షన్‌లలో వస్తున్న ఈ బైక్‌లో 200cc, సింగిల్ సిలిండర్ BS-6 ఇంజన్ ఉంది. ఇది 20.54 bhp, 17.25 Nm అవుట్‌పుట్ ఇస్తుంది. ఇందులో డిస్క్ బ్రేక్‌లతో కూడిన ఏబిఎస్ కూడా ఉంది.
యమహా ఆర్15ఎస్: యమహా ఆర్15ఎస్ ప్రారంభ ధర రూ. 1.65 లక్షలు. ఇది 1 వేరియంట్, 2 కలర్ ఆప్షన్లలో వస్తుంది. దీని 155 ccbs6-2.0 ఇంజన్ 18.6 PS, 14.1 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనికి ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.