Top 5 EVs: ఫుల్ ఛార్జ్‌తో 150 కి.మీలు.. మార్కెట్‌లో మంటలు పుట్టిస్తోన్న 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బైక్‌లు కూడా వదిలేస్తారంతే..!

Top 5 Longest Range Electric Scooters In India: ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు కాలక్రమేణా పెరుగుతున్నాయి. కానీ, ఇప్పుడు చాలా మంది ప్రజలు వాటిని కొనుగోలు చేసే ముందు బ్యాటరీ రేంజ్ గురించి ఆందోళన చెందుతుంటారు.

Update: 2024-03-13 13:30 GMT

Top 5 EVs: ఫుల్ ఛార్జ్‌తో 150 కి.మీలు.. మార్కెట్‌లో మంటలు పుట్టిస్తోన్న 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బైక్‌లు కూడా వదిలేస్తారంతే..!

Top 5 Longest Range Electric Scooters In India: ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు కాలక్రమేణా పెరుగుతున్నాయి. కానీ, ఇప్పుడు చాలా మంది ప్రజలు వాటిని కొనుగోలు చేసే ముందు బ్యాటరీ రేంజ్ గురించి ఆందోళన చెందుతుంటారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు నడపవచ్చు? అనే సందేహంలో ఉంటుంటారు? ఇటువంటి పరిస్థితిలో, ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. Ola Electric, Ather Energy, Komaki, Pure EV, సింపుల్ ఎనర్జీ వంటి కంపెనీలు 150 కిలోమీటర్ల నుంచి 212 కిలోమీటర్ల బ్యాటరీ పరిధిని కలిగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్..

బెంగళూరు ఆధారిత EV కంపెనీ సింపుల్ ఎనర్జీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.45 లక్షల నుంచి రూ. 1.50 లక్షల వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ బ్యాటరీ పరిధి 212 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. దీని గరిష్ట వేగం 105 kmphలు.

Ola S1 ప్రో సెకండ్ జనరేషన్..

భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయ సంస్థ అయిన ఓలా ఎలక్ట్రిక్ ప్రీమియం స్కూటర్ అయిన ఓలా ఎస్1 ప్రో జనరేషన్ 2 ఎక్స్-షోరూమ్ ధర రూ.1.30 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ పరిధి 195 కిలోమీటర్ల వరకు ఉంటుంది. గరిష్ట వేగం 120 కి.మీ.లు.

అథర్ 450x..

ఏథర్ ఎనర్జీ ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450X ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.33 లక్షల నుంచి రూ. 1.36 లక్షల వరకు ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడం ద్వారా 150 కిలోమీటర్ల పరిధిని పొందవచ్చు. ఇది వేగం పరంగా కూడా మంచిది.

Komaki XGT X4..

Komaki XGT X4 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.02 లక్షల నుంచి మొదలై రూ. 1.24 లక్షల వరకు ఉంటుంది. కంపెనీ క్లెయిమ్ ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ పరిధి 180 కి.మీ నుంచి 220 కి.మీ.లుగా ఉంది.

ప్యూర్ EV EPLUTO 7G MAX..

ప్యూర్ EV ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.15 లక్షలు. కంపెనీ క్లెయిమ్ ప్రకారం, దాని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత, ఇది 150 నుంచి 201 కిలోమీటర్ల పరిధిని సాధించగలదు. గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో సేకరించినది. ఏదైనా వస్తును కొనేముందు నిశితంగా పరిశీలించుకోవాలి.)

Tags:    

Similar News