Affordable Cars: 7-సీటర్ కారు కొనాలనుకుంటున్నారా.. 25 కి మీల మైలేజీతో పాటు అద్భుత ఫీచర్లు.. చౌక ధరలోనే..!
Best 7 Seater Cars: భారతదేశంలో 7-సీటర్ కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీనికి కారణం పెద్ద కుటుంబాలకు 7-సీటర్ కార్లు ఉత్తమ ఎంపిక. అలాగే, ఈ కార్లు సుదీర్ఘ ప్రయాణాల్లో మరింత సౌకర్యవంతంగా ఉంటాయి.
Affordable 7 Seater Cars: భారతదేశంలోని ప్రతి సెగ్మెంట్ కార్లను ప్రజలు ఇష్టపడుతున్నారు. కానీ 7-సీటర్ కార్లు ఎల్లప్పుడూ ప్రజల మొదటి ఎంపికగా నిలిచింది. ఈ సమయంలో కూడా, భారతదేశంలో 7-సీటర్ కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీనికి కారణం పెద్ద కుటుంబాలకు 7-సీటర్ కార్లు ఉత్తమ ఎంపిక. అలాగే, ఈ కార్లు సుదీర్ఘ ప్రయాణాల్లో మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. మీరు కొనుగోలు చేయగల ఐదు సరసమైన 7-సీటర్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. మారుతి సుజుకి ఎర్టిగా..
ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 7-సీటర్ కారు. ఈ కారు సరసమైన ధర, అద్భుతమైన మైలేజీ, సౌకర్యానికి ప్రసిద్ధి చెందింది. ఎర్టిగాలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 105 బీహెచ్‌పీ పవర్, 138 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 24.52 kmpl మైలేజీని ఇస్తుంది. ఎర్టిగా ధర రూ.8,64,000 (ఎక్స్-షోరూమ్).
2. రెనాల్ట్ ట్రైబర్..
రెనాల్ట్ ట్రైబర్ మరొక ప్రసిద్ధ 7-సీటర్ కారు. స్టైలిష్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, సరసమైన ధర కారణంగా ఈ కారుని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ట్రైబర్‌లో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 72 బీహెచ్‌పీ పవర్, 96 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 18.1 kmpl మైలేజీని ఇస్తుంది. ట్రైబర్ ప్రారంభ ధర రూ. 6,33,500 (ఎక్స్-షోరూమ్).
3. మహీంద్రా బొలెరో నియో..
మహీంద్రా బొలెరో నియో ఒక SUV. ఇది 7-సీటర్ వేరియంట్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ కారు బలమైన బాడీ, ఆఫ్-రోడ్ సామర్థ్యం, సరసమైన ధరకు ప్రసిద్ధి చెందింది. బొలెరో నియోలో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 100 bhp శక్తిని, 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 17.4 kmpl మైలేజీని ఇస్తుంది. బొలెరో నియో ప్రారంభ ధర రూ. 9,64,000 (ఎక్స్-షోరూమ్),
4. మహీంద్రా స్కార్పియో ఎన్..
మహీంద్రా స్కార్పియో ఎన్ ఒక గొప్ప SUV. ఈ కారు 7-సీటర్ వేరియంట్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రజలు ఈ కారును చాలా ఇష్టపడతారు. స్కార్పియో నియోలో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 138 బిహెచ్‌పి పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 14.5 kmpl మైలేజీని ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 13,26,000 (ఎక్స్-షోరూమ్).
5. టయోటా రూమియన్..
టయోటా రూమియన్ కారు అద్భుతమైన ఇంటీరియర్‌తో వస్తుంది. ఇది స్టైలిష్ డిజైన్, సరసమైన ధరతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ కార్. రోజువారీ ఉపయోగం కోసం ఒక మంచి ఎంపిక. ఇది సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని, భద్రతా లక్షణాలను అందిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 10,29,000 (ఎక్స్-షోరూమ్).