Cars Under 8 Lakh: రూ.8 లక్షల్లోపు ప్రీమియం కార్లు ఇవే.. వ్యాగన్ఆర్ కంటే బెస్ట్ ఆఫ్షన్స్.. ఫీచర్లు చూస్తే ఇంటికి తెచ్చుకోవాల్సిందే..!
Cars Under 8 Lakh: భారతీయ మార్కెట్లో రూ. 8 లక్షలలోపు అనేక గొప్ప కార్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మీరు కారు కొనడానికి రూ. 8-9 లక్షలు వెచ్చించాలనుకుంటే, ఈ బడ్జెట్‌లో మీకు మారుతి వ్యాగన్ఆర్ కంటే చాలా మంచి కార్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Cars Under 8 Lakh: మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ధర రూ. 5.54 లక్షల నుంచి మొదలై రూ. 8.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. WagonR కంటే ఎక్కువ ప్రాక్టికల్, ప్రీమియం ఎంపికలు కలిగిన రూ.8-9 లక్షల బడ్జెట్‌లో వస్తున్న 5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Maruti Suzuki Fronx: ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. ఇది 1.2-లీటర్, 1.0-లీటర్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.47 లక్షల నుంచి రూ. 13.14 లక్షల మధ్య ఉంటుంది. దీని మైలేజ్ 20.09 kmpl వరకు ఉంది.
Maruti Suzuki Baleno: ఇది ఒక ప్రముఖ హ్యాచ్‌బ్యాక్. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.61 లక్షల నుంచి రూ. 9.88 లక్షల మధ్య ఉంటుంది. దీని మైలేజ్ 22.94 kmpl వరకు ఉంది.
Maruti Suzuki Dzire: ఇది బడ్జెట్ సెడాన్. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.51 లక్షల నుంచి రూ.9.02 లక్షల మధ్య ఉంది. దీని మైలేజ్ 22.41 kmpl వరకు ఉంది.
Tata Punch: ఇది మినీ SUV. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.00 లక్షల నుంచి రూ. 9.95 లక్షల మధ్య ఉంది. దీని మైలేజ్ 20.09 kmpl వరకు ఉంది. టాటా పంచ్ 5-స్టార్ గ్లోబల్ NCAP క్రాష్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.
Nissan Magnite: ఇది సబ్-4 మీటర్ల కాంపాక్ట్ SUV. ఇది రెండు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.00 లక్షల నుంచి రూ. 10.00 లక్షల మధ్య ఉంటుంది. దీని మైలేజ్ 20.0 kmpl వరకు ఉంది. ఈ కాంపాక్ట్ SUV గ్లోబల్ NCAP ద్వారా క్రాష్ టెస్ట్‌లలో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.