Cars Under Rs 5 Lakh: 20 కిమీల కంటే ఎక్కువ మైలేజీ.. అదిరిపోయే ఫీచర్లు.. రూ. 5 లక్షలలోపు బెస్ట్ కార్లు ఇవే..
Cars under Rs 5 lakh: కారు కొనడం దాదాపు ప్రతి ఒక్కరి కల. కానీ, చాలా మంది తక్కువ బడ్జెట్ కారణంగా కొనుగోలు చేయలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, రూ. 5 లక్షల కంటే తక్కువ ధరలో వచ్చే 4 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Cars Under Rs 5 Lakh: కారు కొనడం దాదాపు ప్రతి ఒక్కరి కల. తక్కువ బడ్జెట్ ధరలో కార్ల తయారీపై కంపెనీలు ఫోకస్ పెట్టాయి. రూ. 5 లక్షల కంటే తక్కువ ధరలో వచ్చే 4 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంతే కాదు, వీటి మైలేజీ కూడా లీటరుకు 20 కి.మీ కంటే ఎక్కువగా ఉంది.
1. మారుతీ ఆల్టో 800..
మీ బడ్జెట్ రూ. 5 లక్షల లోపు ఉంటే, మీరు ఈ మారుతి కారును సొంతం చేసుకోవచ్చు. మారుతి ఆల్టో 800 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.54 లక్షలుగా ఉంది. ఈ కారు లీటరుకు 22.05 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది దేశంలోనే అత్యంత చౌకైన కారు. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఇది రికార్డు సృష్టించింది.
మారుతి ఆల్టో 800 0.8L F8D పెట్రోల్, 0.8L F8D ద్వి-ఇంధన CNG అనే రెండు ఇంజన్ ఎంపికలతో మార్కెట్లోకి వచ్చింది. పెట్రోల్ వెర్షన్ 47.3 బీహెచ్‌పీ పవర్, 69 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కాగా, CNG వెర్షన్‌లో 40 bhp పవర్, 60 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి అవుతుంది. దీని రెండు ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి.
2. మారుతి ఆల్టో K10..
మారుతి ఆల్టో K10 కూడా భారతదేశంలోని చౌకైన కార్లలో చేరింది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.99 లక్షలు. ఈ కారు లీటరుకు 24.39 కిమీ మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారులో 1.0L K-సిరీస్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఇది 67 bhp, 90 Nm టార్క్ అద్భుతమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
3. మారుతీ S-ప్రెస్సో..
ఈ జాబితాలో మూడవ స్థానంలో మారుతి S-ప్రెస్సో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.26 లక్షలు. ఇది 1.0L K10B పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 67 bhp శక్తిని, 90 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది యూజర్ ఫ్రెండ్లీ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంది. ఈ కారు మైలేజీ లీటరుకు 24.76 కి.మీ.లుగా ఉంది.
4. రెనాల్ట్ క్విడ్..
రెనాల్ట్ క్విడ్ అనేక గొప్ప ఫీచర్లతో వస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.69లుగా ఉంది. ఈ కారు లీటరుకు 21.70 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కారు 1.0-లీటర్ SCe పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 67 bhp శక్తిని, 91 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెనాల్ట్ క్విడ్ 5-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఫీచర్లతో వస్తుంది. కారు ఫ్రంట్ గ్రిల్, సొగసైన హెడ్‌ల్యాంప్‌లు, బోల్డ్ వీల్ ఆర్చ్‌లతో వస్తుంది. ఇది సిటీ డ్రైవింగ్‌కు సరిపోయే కాంపాక్ట్ కార్ అని కంపెనీ చెబుతోంది.