Affordable Cars: 360-డిగ్రీ కెమెరాలు కలిగిన 10 చౌకైన కార్లు ఇవే.. కేవలం రూ. 6 లక్షల నుంచే..!
360-Degree Camera In Cars: కార్లలోని 360-డిగ్రీ కెమెరా అనేది కారు చుట్టూ ఉన్న అన్ని ఏరియాలను రికార్డ్ చేసి చూపిస్తుంది. ఈ వ్యవస్థ అనేక కెమెరాలపై ఆధారపడి ఉంటుంది.
Affordable Cars With 360-Degree Camera: కార్లలోని 360-డిగ్రీ కెమెరా అనేది కారు చుట్టూ ఉన్న అన్ని ఏరియాలను రికార్డ్ చేసి చూపిస్తుంది. ఈ వ్యవస్థ అనేక కెమెరాలపై ఆధారపడి ఉంటుంది. అంటే, దీని కోసం కారు అనేక కెమెరాలతో అమర్చబడి ఉంటుంది. ఇవి కారు వివిధ భాగాలలో ఫిక్స్ చేసి ఉంచుతారు. ఈ కెమెరాల నుంచి స్వీకరించిన ఫుటేజ్ కలిపి చూసిస్తుంది. తద్వారా 360-డిగ్రీల వీక్షణను అందిస్తుంది. ఇది సేఫ్టీ ఫీచర్‌గా కూడా పనిచేస్తుంది. 360-డిగ్రీ కెమెరా డ్రైవర్లు కారు చుట్టూ ఉన్న పరిస్థితిని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది వారికి పార్కింగ్, రివర్స్, రోడ్డుపై ఇతర వాహనాలు, వస్తువులను గుర్తించడంలో సహాయపడుతుంది. దేశంలో 360-డిగ్రీ కెమెరాలు కలిగిన చౌకైన కార్ల గురించి తెలియజేస్తుంది.
360-డిగ్రీ కెమెరాలతో చౌకైన కార్లు..
1. నిస్సాన్ మాగ్నైట్ (ప్రారంభ ధర రూ. 6 లక్షలు)
2. మారుతీ బాలెనో (ప్రారంభ ధర రూ. 6.61 లక్షలు)
3. టయోటా గ్లాంజా (ప్రారంభ ధర రూ. 6.81 లక్షలు)
4. మారుతీ ఫ్రాంక్స్ (ప్రారంభ ధర రూ. 7.46 లక్షలు)
5. టాటా నెక్సాన్ (ప్రారంభం ధర రూ. 7.46 లక్షలు)
6. మారుతి బ్రెజ్జా (ప్రారంభ ధర రూ. 8.29 లక్షలు)
7. మారుతి గ్రాండ్ విటారా (ప్రారంభ ధర రూ. 10.70 లక్షలు)
8. ఎంజీ ఆస్టర్ (ప్రారంభ ధర రూ. 10.82 లక్షలు)
9. టయోటా హైర్డర్ (ప్రారంభ ధర రూ. 10.86 లక్షలు)
10. మారుతి XL6 (ప్రారంభ ధర రూ. 11.56 లక్షలు)
కారులో 360-డిగ్రీ కెమెరా ప్రయోజనాలు
-- 360-డిగ్రీ కెమెరా డ్రైవర్లకు కారు పార్కింగ్‌ను సులభతరం చేస్తుంది. సురక్షితంగా చేస్తుంది. డ్రైవర్లు తమ కారు చుట్టూ ఉన్న పరిస్థితిని చూడగలుగుతారు. ఇది పార్కింగ్ స్థలాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, మరింత ఖచ్చితంగా పార్క్ చేయడానికి సహాయపడుతుంది.
-- 360-డిగ్రీ కెమెరా కూడా కారును సులభంగా, సురక్షితంగా రివర్స్ చేయగలదు. ఇందులో, మీరు కారు వెనుక వైపులా సమాచారాన్ని పొందుతారు. మీరు కారును సురక్షితంగా రివర్స్ చేయగలుగుతారు.