Top-3 Bikes: వామ్మో.. సేల్స్‌లో దూసుకపోతోన్న బైక్స్.. మైలేజీలోనూ టాప్.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతోన్న 3 బైక్స్ ఇవే..!

Top-3 Best Selling Bikes: భారతదేశంలో ప్రజా రవాణాకు రైల్వే చాలా ముఖ్యమైనది. ప్రజా రవాణాలో రైల్వేల పాత్ర, వ్యక్తిగత రవాణాలో ద్విచక్ర వాహనాల పాత్ర కూడా అంతే. ద్విచక్ర వాహనాలు ప్రజల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తాయి.

Update: 2023-12-24 15:30 GMT

Top-3 Bikes: వామ్మో.. సేల్స్‌లో దూసుకపోతోన్న బైక్స్.. మైలేజీలోనూ టాప్.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతోన్న 3 బైక్స్ ఇవే..!

Top-3 Best Selling Bikes In November 2023: భారతదేశంలో ప్రజా రవాణాకు రైల్వే చాలా ముఖ్యమైనది. ప్రజా రవాణాలో రైల్వేల పాత్ర, వ్యక్తిగత రవాణాలో ద్విచక్ర వాహనాల పాత్ర కూడా అంతే. ద్విచక్ర వాహనాలు ప్రజల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. భారతదేశంలో అధిక జనాభా ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారు. మనం కేవలం మోటార్‌సైకిళ్ల గురించి మాట్లాడితే, అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిల్ హీరో స్ప్లెండర్ అగ్రస్థానంలో నిలిచింది. నవంబర్ 2023లో అత్యధికంగా అమ్ముడైన మూడు మోటార్‌సైకిళ్ల గురించి మీకు సమాచారాన్ని అందజేద్దాం.

1. హీరో స్ప్లెండర్..

నవంబర్ 2023లో హీరో స్ప్లెండర్ అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిల్‌గా నిలిచింది. అయితే, వార్షిక ప్రాతిపదికన దీని విక్రయాల్లో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది. కానీ, అంతకు మించి నంబర్-1 స్థానాన్ని నిలబెట్టుకోవడంలో సఫలీకృతమైంది. నవంబర్ 2023లో హీరో స్ప్లెండర్ 2,50,786 యూనిట్లు విక్రయించగా, నవంబర్ 2022లో 2,65,588 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే ఏడాది ప్రాతిపదికన చూస్తే అమ్మకాలు 5.57 శాతం తగ్గాయి.

2. హోండా షైన్..

హీరో స్ప్లెండర్ తర్వాత హోండా షైన్ రెండో స్థానంలో నిలిచింది. వార్షిక ప్రాతిపదికన దాని విక్రయాలలో 35.64% సానుకూల వృద్ధి నమోదైంది. నవంబర్ 2022 నెలలో హోండా షైన్ 1,14,965 యూనిట్లను విక్రయించింది. ఇది ఈ సంవత్సరం (2023) నవంబర్ నెలలో 1,55,943 యూనిట్లకు పెరిగింది. హోండా భారతదేశంలో రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహనాల విక్రయ సంస్థగా నిలిచింది.

3. బజాజ్ పల్సర్..

బజాజ్ పల్సర్ సిరీస్ హీరో స్ప్లెండర్, హోండా షైన్ తర్వాత మూడవ స్థానంలో నిలిచింది. పల్సర్ సిరీస్‌లో చాలా విభిన్నమైన మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. నవంబర్ 2023లో మొత్తం అమ్మకాలు 1,30,403 యూనిట్లుగా ఉండగా, నవంబర్ 2022లో అమ్మకాలు 72,735 యూనిట్లుగా ఉన్నాయి. అంటే, వార్షిక ప్రాతిపదికన దీని అమ్మకాలు 79.28% పెరిగాయి.

Tags:    

Similar News