Best Mileage Tips: మీ సీఎన్‌జీ కార్ మంచి మైలేజీ ఇవ్వడం లేదా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..!
CNG Cars: పెట్రోలు, డీజిల్ ధరల కారణంగా CNG వాహనాల ట్రెండ్ ఊపందుకుంది. కంపెనీలు కూడా తమ కొత్త వేరియంట్‌లను అందించడానికి ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.
Tips to Get Best Mileage From Your Car: పెట్రోలు, డీజిల్ ధరల కారణంగా CNG వాహనాల ట్రెండ్ ఊపందుకుంది. కంపెనీలు కూడా తమ కొత్త వేరియంట్‌లను అందించడానికి ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఎందుకంటే CNG కొంత చౌకగా ఉండటం వల్ల పెట్రోల్, డీజిల్ కంటే తక్కువ కాలుష్యం ఏర్పడుతుంది. పర్యావరణ పరంగా కూడా ఇది చాలా మెరుగైనది. కానీ, మీరు CNG కారును కలిగి ఉంటే మెరుగైన మైలేజీని పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
టైర్ ఒత్తిడిని సరిగ్గా ఉంచండి..
కారు టైర్‌లో గాలి తగ్గడం వల్ల, ఇది మైలేజీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మీ వాహనానికి అనుగుణంగా టైర్‌లో గాలిని ఎల్లప్పుడూ సరిగ్గా ఉంచుకోవాలి. మధ్యలో తనిఖీ చేస్తూ ఉండాలి.
యాక్సిలరేటర్‌ను తరచుగా ఉపయోగించవద్దు..
ఇంజిన్ ఆన్‌లో ఉన్న సమయంలో రెడ్ లైట్ వద్ద నిలబడి లేదా ఎవరి కోసం ఎదురు చూస్తున్న సమయంలో దాన్ని ఆఫ్ చేయండం చాలా మంచిది. ఎందుకంటే దీనితో కూడా మీరు మంచి మైలేజీని పొందలేరు.
కారు నుంచి అనవసరమైన వస్తువులను తొలగించండి..
చాలా మంది వ్యక్తులు తమ కారులో అనవసరమైన వస్తువులను కుప్పలుగా ఉంచుతారు. దీని కారణంగా కారు బరువు పెరుగుతుంది. ఇది మైలేజీపై ప్రభావం చూపిస్తుంది. దీనిని నివారించాలి.
ఎయిర్ ఫిల్టర్, క్లచ్ పరిస్థితిని జాగ్రత్తగా చూసుకోవాలి..
దీన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఉత్తమ మార్గం కారుతో పాటు వచ్చే మాన్యువల్‌ను చదవాలి. అలాగే, దాని ఎయిర్ ఫిల్టర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. అవసరమైతే వాటిని మార్చండి. అలాగే, క్లచ్ సరిగ్గా పని చేస్తుందో లేదో గుర్తుంచుకోండి. అందులో ఏదైనా సమస్య వస్తే మైలేజీపై ప్రభావం పడుతుంది.
సరైన స్పార్క్ ప్లగ్‌లను ఉపయోగించాలి..
CNG కారులో ఇంజన్ ప్రకారం సరైన స్పార్క్ ప్లగ్ ఉపయోగించారా లేదా అనేది కూడా గుర్తుంచుకోవాలి. దాన్ని తనిఖీ చేసి, అది సరైన స్పార్క్ ప్లగ్ కాకపోతే వెంటనే భర్తీ చేయాలి.
CNG సిస్టమ్‌పై నిఘా..
మీ కారులో ఉన్న CNG సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. అందులో లీకేజీ వంటి ఏదైనా ఫిర్యాదు ఉంటే, వెంటనే అధీకృత సర్వీస్ సెంటర్‌లో చూపించాలి.