CNG Car: సీఎన్‌జీ కారు వాహనదారులు ఇవి తెలుసుకోపోతే అంతే సంగతులు..!

CNG Car: మీరు సీఎన్‌జి కిట్‌తో కూడిన కారును ఉపయోగిస్తుంటే లేదా మీ కారులో CNG కిట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి.

Update: 2022-06-17 10:00 GMT

CNG Car: సీఎన్‌జీ కారు వాహనదారులు ఇవి తెలుసుకోపోతే అంతే సంగతులు..!

CNG Car: మీరు సీఎన్‌జి కిట్‌తో కూడిన కారును ఉపయోగిస్తుంటే లేదా మీ కారులో CNG కిట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి. చాలా మంది వ్యక్తులు డబ్బు ఆదా చేసేందుకు అధీకృత డీలర్‌కు బదులుగా రోడ్డు పక్కన ఉన్న మెకానిక్ నుంచి అనధికారిక సీఎన్‌జి కిట్ ఇన్‌స్టాలేషన్ చేయించుకుంటారు. దీనివల్ల అది లీక్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది మంటలకు దారి తీస్తుంది. అందువల్ల కారులో అనధికారిక సీఎన్‌జి కిట్‌లను ఇన్‌స్టాల్ చేయకుండా ఉండటం మంచిది.

కారులో సీఎన్‌జి కిట్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు కారు యజమాని అది సరిగ్గా అమర్చబడిందో లేదో చెక్ చేసుకోవాలి. వైరింగ్ కరెక్ట్‌గా ఇన్‌స్టాల్‌ చేయాల్సి ఉంటుంది. సిలిండర్లు ప్రభుత్వం ఆమోదించినవి మాత్రమే కొనుగోలు చేయాలి.

సీఎన్‌జి కిట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కారు యజమాని సీఎన్‌జి రెట్రోఫిటర్ లేదా లైసెన్సీ నుంచి సీఎన్‌జి సిలిండర్ టెస్ట్ సర్టిఫికేట్‌ను పొందాలి.

సీఎన్‌జి కారు డ్రైవర్ ఎల్లప్పుడూ తన కారును పెట్రోల్‌తో స్టార్ట్ చేయాలి. కనీసం ఒక కిలోమీటరు వాహనం నడిపిన తర్వాత సీఎన్‌జికి మారాలి. ఇలా చేయడం వల్ల కారు ఇంజిన్ లూబ్రికేట్ అవుతుంది.

కారు యజమాని సీఎన్‌జి సిలిండర్ లీకేజీ కోసం క్రమం తప్పకుండా చెక్‌ చేయించుకోవాలి. సీఎన్‌జి కిట్‌ను సరిగ్గా అమర్చకపోవడం లేదా సిలిండర్‌ను ఎక్కువగా నింపడం వల్ల గ్యాస్ లీకేజీకి దారి తీస్తుంద. ఫలితంగా మంటలు, సిలిండర్ పేలిపోయే అవకాశాలు ఉంటాయి.

Tags:    

Similar News