కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 500 కిమీల మైలేజీ.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ విభాగంలో సరికొత్త చరిత్ర..!
*ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. అయితే, ఈవీలకు ఛార్జింగ్ ఓ పెద్ద సమస్యగా మారింది. ఇందుకోసం చైనీస్ ఆటోమేకర్ గీలీ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ 'జీకర్' (Zeekr) అనే సరికొత్త ఛార్జింగ్ సొల్యూషన్ ప్రపంచానికి పరిచయం చేసింది.
Fast Charging Technology Zeekr: ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. అయితే, ఈవీలకు ఛార్జింగ్ ఓ పెద్ద సమస్యగా మారింది. ఇందుకోసం చైనీస్ ఆటోమేకర్ గీలీ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ 'జీకర్' (Zeekr) అనే సరికొత్త ఛార్జింగ్ సొల్యూషన్ ప్రపంచానికి పరిచయం చేసింది. అసలు ఈ జీకర్ ఏంటి, ఎలా పనిచేస్తోంది వివరంగా తెలుసుకుందాం..
ఈ కొత్త సొల్యూషన్ ద్వారా బ్యాటరీని కేవలం 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. దీంతో ఎటువంటి చింత లేకుండా 500 కిమీ (300 మైల్స్) ప్రయాణం చేసుకోవచ్చు.
జీకర్ టెక్నాలజీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలకు ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు ఛార్జింగ్ వేసుకునే సమయం కూడా ఎంతో సేవ్ అవుతోంది. అయితే, ఈ టెక్నాలజీ చైనాలో అందుబాటులోకి వచ్చింది.
అయితే, చైనాలోని మరో కంపెనీ Li Auto తొలి ఈవీని MEGA కోసం ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలను తీసుకొచ్చింది. ఈ బ్యాటరీ కేవలం 12 నిమిషాల ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్ల (300 మైళ్ళు) మైలేజీ ఇస్తుందని వెల్లడించారు.
భారత్‌లోనూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ..
వేగంగా ఫాస్ట్ ఛార్జింగ్ చేసే టెక్నాలజీ భారత్‌లో ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ప్రస్తుతం ఉన్న కంపెనీలు బ్యాటరీని 20 నుంచి 30 నిమిషాల్లో 0 నుంచి 50 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేస్తాయి. కాగా, ఫాస్ట్ ఛార్జింగ్‌తో పదే పదే ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీలు త్వరగా పాడైపోతాయని అంటున్నారు. లేదా బ్యాటరీల్లో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.