Facebook Classic Design : త్వరలో సరికొత్తగా ఫేస్‌బుక్‌ !

Facebook Classic Design : సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌ చాలా పాపులారిటీని సంపాదించుకుంది.. దాదాపుగా ఇప్పుడు ఫేస్‌బుక్‌ అకౌంట్ లేని వాళ్ళు

Update: 2020-08-22 11:24 GMT

Facebook 

Facebook Classic Design : సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌ చాలా పాపులారిటీని సంపాదించుకుంది.. దాదాపుగా ఇప్పుడు ఫేస్‌బుక్‌ అకౌంట్ లేని వాళ్ళు బహుశా ఉండరేమో.. అంతలా ఫేస్‌బుక్‌ కి కనెక్ట్ అయ్యారు.. ఇక ఇది ఇలా ఉంటే ఫేస్‌బుక్‌ తన పాత రూపుకు స్వస్తి పలుకుతోంది. ఇప్పటివరకూ మీకు కనిపించిన క్లాసిక్ లుక్ కనిపించదు.. యూజర్లందరికీ కొత్త లుక్‌ను అందుబాటులోకి తీసుకురానుంది ఫేస్ బుక్..

ఇప్పుడు మనం ఫేస్‌బుక్‌ ని ఓపెన్ చేయగానే.. నీలం చార, తెలుపు, నలుపు అక్షరాలు కనిపిస్తాయి.. అయితే తాజాగా కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే కొందరికి ఈ లుక్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కొత్త లుక్ ఇష్టపడని వాళ్ళ కోసం పాత లుక్‌లో మారేందుకు వీలుగా డ్రాప్‌డౌన్‌ మెనూలో క్లాసిక్‌ లుక్‌కు మారే అవకాశాన్ని కూడా కలిపించింది.. సెప్టెంబర్‌ లోపు ఈ క్లాసిక్‌ లుక్‌కు గుడ్‌బై చెప్పాలని ఫేస్‌బుక్‌ భావిస్తోంది.

ఇకపై అందరికీ న్యూలుక్‌ మాత్రమే అందించనుంది. అంతేకాకండా డార్క్ మోడ్ ఫీచర్ ను కూడా ఫేస్ బుక్ తన వినియోగదారులకు అందిస్తోంది. కొత్త లుక్‌లో సెర్చ్‌, హోమ్‌, వాచ్‌, మార్కెట్‌ప్లేస్‌, గ్రూప్స్‌, గేమింగ్‌ పేజెస్‌, ప్రొఫైల్‌, క్రియేట్‌, మెసెంజర్‌, నోటిఫికేషన్‌, డ్రాప్‌డౌన్‌ మెనూ విడివిడిగా పెద్ద ఐకాన్స్‌తో కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News