Car AC Effect: కార్ ఏసీ వల్ల మైలేజీ తగ్గుతుందా.. ఈ విషయాలని గమనిస్తే మీకే తెలుస్తుంది..!
Car AC Effect: వేసవిలో ఏసీ లేకుండా కారులో ప్రయాణించలేరు. అయితే కారు ఏసీ స్టార్ట్ చేయగానే ముందుగా గుర్తుకు వచ్చేది మైలేజీ.
Car AC Effect: వేసవిలో ఏసీ లేకుండా కారులో ప్రయాణించలేరు. అయితే కారు ఏసీ స్టార్ట్ చేయగానే ముందుగా గుర్తుకు వచ్చేది మైలేజీ. కారులో ఏసీని ఉపయోగించడం వల్ల మైలేజీ తగ్గుతుందని అందరికి తెలుసు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏసీ స్పీడ్‌ని పెంచడం లేదా తగ్గించడం వల్ల వాహనం మైలేజీకి ఏమైనా తేడా వస్తుందా లేదా అనే ప్రశ్న చాలామందిలో మెదులుతోంది. దాని గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం.
ఏసీ ఫ్యాన్ వేగం కారు మైలేజీని తగ్గిస్తుందా?
వాస్తవానికి కారు ఏసీ నేరుగా ఇంజిన్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. కానీ ఏసీ ఫ్యాన్ మాత్రం బ్యాటరీకి కనెక్ట్ చేయబడి ఉంటుంది. అప్పుడు ఫ్యాన్ వేగాన్ని పెంచడం లేదా తగ్గించడం వల్ల వాహనం పనితీరు లేదా ఇంధన వ్యవస్థకు ఎలాంటి తేడా ఉండదు. అంటే ఏసీ ఆన్ చేసి ఉంటే వేగంగా డ్రైవ్ చేసినా కూడా టెన్షన్ ఫ్రీగా ఉండవచ్చు. ఏసీ నడుస్తుండగా మైలేజీని పెంచుకోవడానికి ఈ చిట్కాలు తెలుసుకోండి.
1. కారును స్టార్ట్ చేసిన వెంటనే ఏసీని ఆన్ చేయవద్దు. ముందుగా విండోస్ తెరిచి వేడి గాలి బయటకు వెళ్లనివ్వాలి. ఇలా చేయడం వల్ల కారులోని ఏసీ క్యాబిన్‌ను చల్లబరచేందుకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం ఉండదు.
2. ఏసీని ఉపయోగిస్తున్నప్పుడు రీ-సర్క్యులేషన్ బటన్‌ను నొక్కాలని గుర్తుంచుకోండి. ఈ బటన్‌ను నొక్కడం వల్ల కారు బయటి నుంచి గాలిని తీసుకోవడం ఆపి క్యాబిన్‌లో ఉన్న గాలిని నిరంతరం చల్లబరుస్తుంది.
3. ఎండలో కారు పార్కింగ్ చేయడం మానుకోవాలి. వీలైతే నీడలో పార్క్ చేయాలి. లేదా విండో సన్-షేడ్స్ ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల కారు వేడిగా ఉండదు. క్యాబిన్‌ను చల్లబరచడానికి ఏసీ తక్కువ పనిచేస్తే సరిపోతుంది.