Sign Boards: రోడ్డు పక్కన సైన్ బోర్డులు ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా? అసలు విషయం ఇదే..!
Significance Of Red Color In Road Signs: రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డులు ఎరుపు రంగులో ఉన్నాయని మీరు గమనించారా?
Significance Of Red Color In Road Signs: రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డులు ఎరుపు రంగులో ఉన్నాయని మీరు గమనించారా? మీరు గమనించినట్లయితే ఇది అలా ఎందుకు ఉంటాయోనని ఆలోచించారా. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి, ఎరుపు రంగు అత్యంత దృష్టిని ఆకర్షించే రంగుగా పరిగణిస్తుంటారు. ఎరుపు రంగు దూరం నుంచి కూడా సులభంగా కనిపిస్తుంది. అందుకే రోడ్డు పక్కనే ఉన్న సైన్ బోర్డులు ఎరుపు రంగులో ఉంటాయి. రోడ్డు సైన్‌బోర్డ్‌లలో నిలుపుదల, వేగాన్ని తగ్గించడం, జాగ్రత్తగా ఉండటం కోసం ఎరుపు రంగును తరచుగా ఉపయోగిస్తారు. ప్రమాదాల గురించి డ్రైవర్లను హెచ్చరిస్తుంది.
రోడ్డు పక్కన ఎరుపు రంగు సైన్ బోర్డులు..
స్టాప్ సైన్: స్టాప్ గుర్తు ఎరుపు రంగులో తయారు చేస్తుంటారు. ఎందుకంటే వీటిని చూసినప్పుడు డ్రైవర్లు ఆగవలసి ఉంటుంది. మీరు స్టాప్ గుర్తును గమనిస్తే అది ఎరుపు రంగులో మాత్రమే ఉంటుంది.
ట్రాఫిక్ సిగ్నల్స్: ట్రాఫిక్ సిగ్నల్స్ ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులతో తయారు చేస్తున్నారు. ఇక్కడ ఎరుపు రంగు అంటే స్టాప్ చేయాలని అర్థం.
హెచ్చరిక సంకేతాలు: ఎరుపు రంగులో హెచ్చరిక సంకేతాలు తయారు చేస్తుంటారు. ఇది ప్రమాదం గురించి డ్రైవర్లను హెచ్చరిస్తుంది. యాక్సిడెంట్ ఏరియా అని చెప్పడానికి రెడ్ సిగ్నల్ వాడుతుంటారు.
అయితే, కొన్ని రోడ్ సైడ్ సైన్ బోర్డులు ఎరుపు రంగులో లేవు. ఉదాహరణకు, "సిటీ సెంటర్" లేదా "హాస్పిటల్" గుర్తుల వంటి సూచనల సంకేత బోర్డులు సాధారణంగా ఆకుపచ్చగా ఉంటాయి. ఎందుకంటే ఈ సంకేతాలు ప్రమాదాన్ని హెచ్చరించడానికి కాకుండా డ్రైవర్లకు సమాచారాన్ని అందిస్తాయి.