Citroen ec3: టాప్ క్లాస్ ఫీచర్లున్నా.. క్రాష్ టెస్ట్‌లో జీరో స్టార్.. ఘోరంగా విఫలమైన సిట్రోయెన్ eC3 ఎస్‌యూవీ..!
Citroen ec3 NCAP Crash Test: సిట్రోయెన్ ఇండియా ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ eC3 భద్రతా పరీక్షలు నిర్వహించారు. అయితే, దాని ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
Citroen ec3 NCAP Crash Test: సిట్రోయెన్ ఇండియా ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ eC3 భద్రతా పరీక్షలు నిర్వహించారు. అయితే, దాని ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. పరీక్షించిన మోడల్‌లో ఫ్రంట్ డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు, బెల్ట్ లోడ్ లిమిటర్, సీట్ బెల్ట్ రిమైండర్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో జీరో స్టార్‌లను స్కోర్ చేయడంతో అంతా షాక్‌కి గురయ్యారు.
eC3 వయోజన ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 34 పాయింట్లకు 20.86 పాయింట్లు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 49 పాయింట్లకు 10.55 పాయింట్లు సాధించింది. గ్లోబల్ NCAP ప్రకారం, డ్రైవర్, ప్రయాణీకుల తల, మెడకు అందించిన సేఫ్టీ బాగుంది. అయితే, సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ నిర్వహించలేదు. ఎందుకంటే ఒక ఎంపికగా కూడా సైడ్ హెడ్ ప్రొటెక్షన్ అందుబాటులో లేదు. కారు బాడీ షెల్ స్థిరంగా ఉంది.
ఇది కాకుండా, ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లో ABS విత్ EBD, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ డోర్ మాన్యువల్ చైల్డ్ లాక్, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, స్పీడ్-సెన్సిటివ్ ఆటో డోర్ లాక్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఒక నెల క్రితం, ఆటోమేకర్ తన అన్ని కార్లకు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX, వెనుక సీట్ బెల్ట్ రిమైండర్ వంటి భద్రతా లక్షణాలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఇవి 2024 రెండో అర్థభాగంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.