Citroen Basalt vs Tata Curvv EV: సై అంటే సై అంటున్న సిట్రోయెన్, టాటా కర్వ్.. రెండు కార్లలో ఏది బెస్ట్ అంటే..?
Citroen Basalt vs Tata Curvv EV: దేశీయ ఆటో మార్కెట్లో సిట్రోయెన్ బసాల్ట్, టాటా కర్వ్ EV లాంచ్ అయ్యాయి. రెండిటిలో ఏది బెస్టో తెలుసుకోండి.
Citroen Basalt vs Tata Curvv EV: దేశీయ ఆటో మార్కెట్లో రెండు కార్లు విడుదలయ్యాయి. వాటిలో ఒకటి సిట్రోయెన్ బసాల్ట్, మరొకటి టాటా కర్వ్ EV. రెండు కార్లు మార్కెట్లో టాప్ పర్ఫామెన్స్ క్లెయిమ్ చేస్తున్నాయి. సిట్రోయెన్ బసాల్ట్ ధరలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, టాటా కర్వ్ EV దాని ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్, లాంగ్ రేంజ్‌తో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ రెండు కార్లలో ఏది బెస్ట్, రెండిటి ఫీచర్లు తదితర వివరాలను తెలుసుకుందాం.
సిట్రోయెన్ బసాల్ట్‌లో 1.2-లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది రెండు వేరియంట్‌లలో వస్తుంది - నాచురల్ ఎక్స్‌పెక్ట్ (80 bhp, 115 Nm), టర్బోచార్జ్డ్ (109 bhp, 190 Nm). మరోవైపు టాటా కర్వ్ EVలో స్టాండర్డ్ వేరియంట్ 45kWh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 502 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది, అయితే హై వేరియంట్ 55kWh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 585 కిలోమీటర్లు వరకు వెళుతుంది.
సిట్రోయెన్ బసాల్ట్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, త్రీ స్టెప్స్ అడ్జస్టమెంట్ వంటి అద్భుతమైన ఫీచర్‌లతో వస్తుంది. అదే సమయంలో టాటా కర్వ్ EV పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్ 2 ADAS వంటి లేటెస్ట్ ఫీచర్‌లతో మినిమలిస్టిక్ డిజైన్‌తో వస్తుంది.
సిట్రోయెన్ బసాల్ట్, టాటా కర్వ్ EV రెండూ అధునాత సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నాయి. రెండు కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎస్ప్, అన్ని డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. అయినప్పటికీ, ADAS వంటి అధునాతన భద్రతా టెక్నాలజీ టాటా కర్వ్ EVలో అందుబాటులో ఉంది. ఇది భద్రత పరంగా సిట్రోయెన్ బసాల్ట్ కంటే ముందుంది.
సిట్రోయెన్ బసాల్ట్ ప్రారంభ ధర రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్).ఇది బడ్జెట్ సెగ్మెంట్‌లో లభిస్తుంది. అదే సమయంలో టాటా కర్వ్ EV ప్రారంభ ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని ఎలక్ట్రిక్ టెక్నాలజీ, లాంగ్ రేంజ్‌కు చాలా ఉపయోగంగా ఉంటుంది. టాటా కర్వ్ ఈవీ మల్టిపుల్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ధరలు రూ. 21.99 లక్షల వరకు ఉన్నాయి.
మీ బడ్జెట్ దాదాపు రూ. 10 లక్షలు, పెట్రోల్ ఇంజన్ SUVని కొనుగోలు చేయాలనుకుంటే, సిట్రోయెన్ బసాల్ట్ మీకు బెస్ట్ ఆప్షన్. ఈ కారు ప్రత్యేకమైన డిజైన్, తగిన ఫీచర్లతో వస్తుంది. మరోవైపు మీరు ఎలక్ట్రిక్ మార్కెట్‌లో కావాలనుకుంటే, పెట్రోల్‌పై అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలంటే మీరు టాటా కర్వ్ EVని కొనుగోలు చేయవచ్చు.