Car Care Tips: వేసవిలో తరచుగా కారు ప్రయాణం చేస్తున్నారా.. ముందుగా ఇవి చెక్‌ చేసుకోండి..!

Car Care Tips: వేసవిలో తరచుగా కారులో ప్రయాణిస్తున్నట్లయితే వెహికల్‌ గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎండాకాలంలో వాహనాల్లో చాలా సమస్యలు మొదలవు తాయి.

Update: 2024-03-19 09:34 GMT

Car Care Tips: వేసవిలో తరచుగా కారు ప్రయాణం చేస్తున్నారా.. ముందుగా ఇవి చెక్‌ చేసుకోండి..!

Car Care Tips: వేసవిలో తరచుగా కారులో ప్రయాణిస్తున్నట్లయితే వెహికల్‌ గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎండాకాలంలో వాహనాల్లో చాలా సమస్యలు మొదలవు తాయి. వేడి కారణంగా ఇంజిన్, టైర్లు, బ్యాటరీ, వాహనం ఇతర భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. వేడి కారణంగా ఇంజిన్ వేడెక్కుతుంది. టైర్లు పగిలిపోవచ్చు AC పని చేయకపోవచ్చు. అందుకే వేసవికి ముందే కారులో చెక్ చేయాల్సిన అంశాల గురించి తెలుసుకుందాం.

1. ఇంజిన్ ఆయిల్

వేసవికి ముందు కారులో చెక్‌ చేయాల్సిన మొదటి విషయం ఇంజిన్ ఆయిల్. వాహనంలో ఇంజిన్ ఆయిల్ సరిపోను ఉందా లేదా చూసుకోవాలి. వేసవిలో ఇంజిన్ ఆయిల్ ఇంజిన్‌ను లూబ్రికేట్ చేస్తుంది దానిని చల్లగా ఉంచుతుంది. అందువల్ల కారులో ఇంజిన్ ఆయిల్, కూలెంట్ తగినంత ఉండటం అవసరం. ఇంజిన్ ఆయిల్‌ను చాలా కాలంగా మార్చకపోతే వెంటనే మార్చుకోండి.

2. ఆయిల్ ఫిల్టర్

ఇంజిన్ ఆయిల్‌తో పాటు ఆయిల్ ఫిల్టర్ కూడా కారులో చాలా ముఖ్యమైనది. కారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆయిల్ ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా మార్చడం అవసరం.

3. కూలెంట్

కూలెంట్‌ ఇంజిన్ నుంచి వేడిని తొలగిస్తుంది. వాహనంలో తగినంత మొత్తంలో కూలెంట్‌ లేకపోతే వేడి ఎక్కువగా వస్తుంది. వాహనం తొందరగా వేడెక్కుతుంది. వేసవిలో కూలెంట్‌ స్థాయి తగ్గవచ్చు. అందువల్ల కారులో కూలెంట్‌ స్థాయిని చెక్‌ చేయడం అవసరం.

4. బ్యాటరీ

కారులో బ్యాటరీ అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే అది కారును స్టార్ట్‌ చేస్తుంది. ఇది కాకుండా కారులోని అనేక ఇతర వస్తువులు కూడా బ్యాటరీ సాయంతో పనిచేస్తాయి. బ్యాటరీ సరిగ్గా పని చేయకపోతే మీరు కారుని స్టార్ట్ చేయడంలో ఇబ్బంది పడుతారు. వేసవిలో బ్యాటరీ త్వరగా పాడైపోతుంది. అందువల్ల బ్యాటరీ టెర్మినల్స్, ఛార్జింగ్ సిస్టమ్, యాసిడ్ స్థాయిని చెక్‌ చేస్తూ ఉండాలి. 

Tags:    

Similar News