Car Tips: కార్ విండ్ స్క్రీన్ మీద 'బ్లాక్ డాట్స్' ఎందుకు ఉంటాయో తెలుసా? కారణం తెలిస్తే, ఔరా అనాల్సిందే..!

Car Windscreen: కార్లను తయారు చేసేటప్పుడు కంపెనీలు చాలా విషయాలను దృష్టిలో ఉంచుకుంటాయి.

Update: 2024-05-21 14:30 GMT

Car Tips: కార్ విండ్ స్క్రీన్ మీద 'బ్లాక్ డాట్స్' ఎందుకు ఉంటాయో తెలుసా? కారణం తెలిస్తే, ఔరా అనాల్సిందే..

Car Windscreen: కార్లను తయారు చేసేటప్పుడు కంపెనీలు చాలా విషయాలను దృష్టిలో ఉంచుకుంటాయి. కారు పైకప్పు నుంచి చక్రాల వరకు, బంపర్ నుంచి టెయిల్ లైట్ వరకు.. ఎటువంటి కారణం లేకుండా ఏదీ ఇన్‌స్టాల్ చేయదు. అయితే, చాలా సార్లు మనం కారులో కనిపించే చిన్న వస్తువులను విస్మరిస్తుంటాం. కానీ, ఈ విషయాలు కారులో కీలక పాత్ర పోషిస్తాయి. ఏళ్ల తరబడి కార్లు నడుపుతున్న వారికి కూడా ఈ విషయాలు తెలియకపోవచ్చు. అలాంటి ఓ విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.

మనం కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వెంటనే మనకు ముందుగా కనిపించేది విండ్ స్క్రీన్. ఇది లేకపోతే, మీరు 10 నిమిషాలు కూడా సరిగ్గా కారును నడపలేరు. కానీ, ఈ రోజు మనం విండ్‌స్క్రీన్ గురించి కాకుండా దాని అంచున కనిపించే నల్లని చుక్కల గురించి తెలుసుకుందాం.. మీరు తరచుగా ఈ నల్లని చుక్కలను చూస్తుంటారు. కానీ, విండ్‌స్క్రీన్‌పై ఈ చుక్కలు ఎందుకు తయారు ఉంటాయనే విషయం మీరు ఎప్పుడైన ఆలోచించారా?

విండ్‌స్క్రీన్ మెరుగ్గా కనిపించేలా చేయడానికి ఇవి ఉద్దేశించినవి అని చాలా మంది అనుకుంటారు. అయితే, ఇది దానిలోని ఒక అంశం మాత్రమే. ఇంతకుముందు చెప్పినట్లుగా, కంపెనీ అనవసరంగా కారులో ఏమీ ఇన్‌స్టాల్ చేయదు. అందువల్ల, ఇది విండ్‌స్క్రీన్‌పై చాలా ప్రత్యేకమైన పనితీరును కలిగి ఉందన్నమాట.

విండ్‌స్క్రీన్‌పై చిన్న నల్లని చుక్కలు కారు అందాన్ని పెంచుతాయి. అయితే వాటి అతి ముఖ్యమైన పని ఏమిటంటే విండ్‌స్క్రీన్‌ను కారు ఫ్రేమ్ నుంచి బయటకు రాకుండా రక్షించడం. నిజానికి, ఫ్రిట్స్ అని కూడా పిలిచే ఈ నల్లని చుక్కలు, విండ్‌స్క్రీన్‌పై పూసిన జిగురు బాగా అతుక్కోవడానికి సహాయపడతాయి.

నలుపు చుక్కలు విండ్‌స్క్రీన్ చుట్టూ ఒక కఠినమైన ఉపరితలాన్ని సృష్టిస్తాయి. ఇది జిగురు గాజుకు గట్టిగా అతుక్కోవడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా, ఈ నల్లని చుక్కలు సూర్యుని అతినీలలోహిత కిరణాలను అడ్డుకుంటాయి. ఇది గాజు అంచులపై పూసిన జిగురు కరిగిపోకుండా, వదులుగా మారకుండా చేస్తుంది.

ఇది కాకుండా, కారు విండ్‌స్క్రీన్ నల్ల చుక్కలతో బాగుంటుంది. ఇవి విండ్‌స్క్రీన్‌పై బోర్డర్‌లుగా పనిచేస్తాయి.

Tags:    

Similar News