EV Vehicles: ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనే వారికి కేంద్రం గుడ్ న్యూస్.. రూ. 50 వేల వరకు సబ్సిడీ..!
EV Vehicles: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోన్న విషయం తెలిసిందే.
EV Vehicles: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇంధన వినియోగం భారీగా పెరగడంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రపంచ దేశాలన్నీ ఈవీ వెహికిల్స్‌కు మొగ్గు చూపుతున్నాయి. ప్రభుత్వాలు సైతం ఈ వాహనాల అమ్మకానికి ఊతమిస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈవీ విహికిల్స్ ఉత్పత్తిని పెంచేందుకు గాను కంపెనీలకు సబ్సిడీని అందిస్తోంది.
టూవీలర్స్, త్రివీలర్స్ తయారీ చేసే కంపెనీలకు ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఈఎంపీఎస్) కింద సబ్సిడీ బెనిఫిట్ అందిస్తూ వస్తోంది. అయితే ఇటీవల ఈ సబ్సిడీ ఎత్తివేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈఎంపీఎస్ స్కీమ్ మరికొంత కాలం పొడగించనున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామి తెలిపారు. ఫేమ్ 3 స్కీమ్‌ను తీసుకువచ్చేంత వరకు ఈఎంపీఎస్ సబ్సిడీ బెనిఫిట్ అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఈ సబ్సిడీ ద్వారా కస్టమర్లు భారీగా బెనిఫిట్ పొందుతారు. ఫేమ్ 3 అమలుకు మరో రెండు నెలల సమయం పట్టొచ్చని కుమార స్వామి తెలిపారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయంగా చెప్పొచ్చు. ఆటోమోటివ్ కాంపొనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ 64వ వార్షిక సమావేశంలో భాగంగా సోమవారం కేంద్ర మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇదిలా కేంద్ర ప్రభుత్వం ఈఎంపీఎస్ స్కీమ్ కోసం రూ. 500 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ టూవీలర్లు, ఎలక్ట్రిక్ త్రివీలర్ల కొనుగోలుపై సబ్సిడీ వస్తుంది. తాజాగా మరో రెండు నెలలు పొడగించడంతో ఇందుకోసం రూ. 278 కోట్లు కేటాయించారు. ఈ స్కీమ్ ద్వారా ఎలక్ట్రిక్ టూవీలర్లపై రూ.10 వేల వరకు, త్రివీలర్లపై రూ. 50 వేలు సబ్సిడీ లభిస్తుంది. కంపెనీలు వాహనాలను డిస్కౌంట్‌తో కస్టమర్లకు అందిస్తాయి. తర్వాత సబ్సిడీ డబ్బులను ప్రభుత్వం నుంచి పొందుతారు. ప్రజలకు ఈవీ వాహనాలను అలవాటు చేసే నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.