Cars Sales: గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తోన్న ఖరీదైన ఎస్‌యూవీలు.. లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Cars Sales: పెద్ద నగరాల్లో నివసించే వారు మాత్రమే ఖరీదైన SUVలను కొనుగోలు చేస్తారని మీరు అనుకుంటే, పప్పులో కాలేసినట్లే.

Update: 2024-05-26 14:00 GMT

Cars Sales: గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తోన్న ఖరీదైన ఎస్‌యూవీలు.. లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Cars Sales: పెద్ద నగరాల్లో నివసించే వారు మాత్రమే ఖరీదైన SUVలను కొనుగోలు చేస్తారని మీరు అనుకుంటే, పప్పులో కాలేసినట్లే. నిజానికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా ఖరీదైన వాహనాలను కొనుగోలు చేయడంలో వెనుకంజ వేయడం లేదు. తాజాగా ప్యాసింజర్ వాహనాల విక్రయాలకు సంబంధించిన కొన్ని గణాంకాలు షాక్ ఇస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. దీని కారణంగా మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, హోండా ఎస్‌యూవీ అమ్మకాలు పెరిగాయి.

ఈ అన్ని కంపెనీల SUV అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో పెరిగాయి. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో ఎక్సెటర్, వెన్యూ, క్రెటా వంటి ఎస్‌యూవీల విక్రయాల్లో వాటా 67 శాతంగా ఉంది. గత ఏడాది కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తొలిసారిగా కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య 44 శాతం పెరిగింది.

టాటా మోటార్స్ గ్రామీణ విక్రయాల్లో 70 శాతం SUVలు ఉండగా, మారుతి సుజుకి బ్రెజ్జా విక్రయాల్లో 43 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి జరిగాయంట. హోండా కార్స్ ఇండియా తన కొత్త SUV ఎలివేట్ అమ్మకాలలో నాలుగింట ఒక వంతు టైర్-III మార్కెట్ల నుంచి వచ్చినట్లు తెలిపింది.

గ్రామాలలో ఎస్‌యూవీ అమ్మకాలు ఎందుకు పెరిగాయి?..

గ్రామాల్లో ఎస్‌యూవీ వాహనాలకు మంచి డిమాండ్ రావడానికి కారణం ఆదాయంలో మెరుగుదల, రోడ్ల పరిస్థితి మెరుగుపడడమే. గ్రామీణ సేవా రంగంలో ఉపాధిలో వృద్ధి, మెరుగైన రహదారి కనెక్టివిటీతో ఈ మార్కెట్లలో SUVల డిమాండ్ పెరిగింది.

Tags:    

Similar News