Car Modification Rules: కారు రంగు మారితే భారీ చలాన్ పడుతుంది.. రూల్స్ ఏంటో తెలుసా..?

Car Modification Rules: ప్రస్తుతం భారత దేశంలో కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఒక్కప్పుడు బైక్ అంటే ఇష్టం చూపే వాళ్లు ఇప్పుడు కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.

Update: 2024-12-06 10:48 GMT

Car Modification Rules: కారు రంగు మారితే భారీ చలాన్ పడుతుంది.. రూల్స్ ఏంటో తెలుసా..?

Car Modification Rules: ప్రస్తుతం భారత దేశంలో కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఒక్కప్పుడు బైక్ అంటే ఇష్టం చూపే వాళ్లు ఇప్పుడు కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో కంపెనీలు కూడా వారిని అట్రాక్ట్ చేయడానికి ఆకర్షణీయమైన ఆఫర్లను అందజేస్తున్నాయి. కారును కొనుగోలు చేసే ముందు ఆర్టీవో నియమాలను కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. మీరు ఎరుపు రంగు కలిగిన కారును కొనుగోలు చేసినట్లు అయితే.. ఇక చాలు దానిని నీలిరంగుకు మార్చుకోవాలని భావిస్తుంటే తప్పని సరిగా ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ఇష్టానుసారం మీ కారు రంగును మార్చడం వలన మీ జేబు ఖాళీ కావాల్సి వస్తుంది.

భారతదేశంలో వాహనాలకు సంబంధించి చాలా మంది ప్రజలకు తెలియని అనేక నియమాలు ఉన్నాయి. మీరు తెలిసి లేదా తెలియక ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా కట్టాల్సి వస్తుంది. వాహనాల పెయింట్‌ను మార్చడానికి దానిని ఆర్టీవో లో అధికారికంగా నమోదు చేసుకోవాలి. మీరు దానిని చట్టబద్ధంగా పూర్తి చేయకుండా వాహనం రూపాన్ని మార్చితే భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది. కారు రంగును మార్చవలసి వస్తే ఎలా అనుమతి తీసుకోవచ్చు అనే ప్రక్రియ కూడా క్రింద తెలుసుకుందాం.

కారు రంగు మారితే?

కారు రంగును మార్చడం వల్ల ఎటువంటి హాని లేదు, మీరు దీన్ని ఎప్పుడైనా చేయవచ్చు. కానీ రంగు మారడానికి ముందు, దానిని ఆర్టీవో వద్ద నమోదు చేసుకోవడం అవసరం. అంతే కాకుండా మీ ఆర్‌సి బుక్‌లో కారు రంగు మార్చినట్లు కూడా పేర్కొనాలి. మీరు దీన్ని విస్మరించి, మీ ఇష్టానుసారం రంగును మార్చుకుంటే, మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. పోలీసుల తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వస్తే వేలల్లో జరిమానా విధించవచ్చు. ఇది మాత్రమే కాదు, మీ కారును కూడా జప్తు చేయవచ్చు.

కారు రంగును మార్చడానికి సరైన మార్గం

మీరు కారులో ఏదైనా సవరణలు చేస్తుంటే, ఈ విషయాలను అనుసరించాల్సి ఉంటుంది. మీ సవరణ కారు అధికారిక రూపాన్ని పూర్తిగా మార్చినట్లయితే.. దీని కోసం మీరు మీ ప్రాంతంలోని ఆర్టీవో కార్యాలయానికి వెళ్లవలసి ఉంటుంది. ఈ మార్పు కోసం మీరు కొంత రుసుం కూడా చెల్లించాలి. ఇది కాకుండా, ఈ మార్పును కారు ఆర్సీలో ఏ రంగు వేస్తున్నారో పేర్కొనవలసి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీరు మీ కారు రంగును మార్చుకోవచ్చు.

Tags:    

Similar News