Bajaj CNG Bike: విడుదలకు సిద్ధమైన బజాజ్ CNG బైక్.. మైలేజీతో పాటు పూర్తి వివరాలు మీకోసం..!

Bajaj CNG Bike: బజాజ్ ఆటో భారత మార్కెట్ కోసం CNG బైక్ ఎంపికను అన్వేషిస్తోంది. దీని ఉద్దేశ్యం ప్రజలకు వాహన నిర్వహణ ఖర్చును తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం.

Update: 2023-10-22 15:30 GMT

Bajaj CNG Bike: విడుదలకు సిద్ధమైన బజాజ్ CNG బైక్.. మైలేజీతో పాటు పూర్తి వివరాలు మీకోసం..!

Bajaj Bike: బజాజ్ ఆటో భారత మార్కెట్ కోసం CNG బైక్ ఎంపికను అన్వేషిస్తోంది. దీని ఉద్దేశ్యం ప్రజలకు వాహణ నిర్వహణ ఖర్చును తగ్గించడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించడం. మీడియా నివేదికల ప్రకారం, బజాజ్ ఇప్పుడు CNG-కమ్-పెట్రోల్ బైక్‌పై పని చేస్తోంది. దీని అంతర్గత కోడ్‌నేమ్ బ్రూజర్ E101 అని తెలుస్తోంది. దాదాపుగా చివరి దశలో ఉంది.

ఇది 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు..

నివేదికల ప్రకారం, ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే, ఇది 6 నెలల నుంచి 1 సంవత్సరంలోపు మార్కెట్లోకి రావచ్చు. కొన్ని ప్రోటోటైప్ యూనిట్లు ఇప్పటికే తయారు చేశారు. ఇది 110 సీసీ బైక్ కావచ్చు. తొలుత దీనిని కంపెనీ ఔరంగాబాద్‌లో ఉత్పత్తి చేయాలని, ఆపై పంత్‌నగర్‌లో ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నారు.

CNG బైక్ పేరు ఏమిటి?

దీని కోసం ప్లాటినా బ్రాండ్ పేరును పరిశీలిస్తున్నారు. అయితే, బజాజ్ ఆటో ఇడి రాకేష్ శర్మ దాని గురించి నిర్దిష్ట సమాచారాన్ని పంచుకోవడానికి నిరాకరించారు. కానీ, "మేం ఖచ్చితంగా మా పోర్ట్‌ఫోలియోలో 'క్లీన్ ఫ్యూయల్స్' వాటాను విస్తరించాలనుకుంటున్నాం, ఇందులో మొత్తం స్పెక్ట్రమ్ EVలు, ఇథనాల్, LPG, CNG ఉన్నాయి" అని తెలిపింది.

రాజీవ్ బజాజ్ ప్రకటన..

ఇది కాకుండా, ఇటీవల బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ఎవరికి తెలుసు. బహుశా సీఎన్‌జీ బజాజ్ మోటార్‌సైకిల్ ప్రజల బైక్‌ను నడపడానికి అయ్యే ఖర్చును సగానికి తగ్గించగలదు' అని అన్నారు. సీఎన్‌జీ మోటార్‌సైకిళ్లు 100-110సీసీ సెగ్మెంట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలవని ఆయన సూచించారు.

Tags:    

Similar News