Heavy Discounts On Cars: ఆఫర్స్ అంటే ఇలా ఉండాలి.. కారుపై రూ. 12 లక్షల డిస్కౌంట్.. మిస్ అవ్వకండి..!

Heavy Discounts On Cars: ఆటోమొబైల్ కంపెనీలు కార్లపై రూ. 12 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. సేల్స్ పడిపోవడమే దీనికి కారణం.

Update: 2024-09-03 07:57 GMT

Heavy Discounts On Cars

Heavy Discounts On Cars: కార్ల తయారీ కంపెనీలు రోజుకో కొత్త కారును విడుదల చేస్తున్నాయి. కానీ ఓల్డ్ స్టాక్ క్లియర్ చేయడం లేదు. ఆటో పరిశ్రమ కష్టాల్లో ఉందనే టాక్ వినిపిస్తుంది. సేల్స్ పెంచుకునేందుకు కంపెనీలు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. మారుతీ సుజికీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు పండుగ సీజన్ కావడంతో కార్ల కంపెనీలన్నీ ఆశలు పెట్టుకున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రకారం దేశంలో అమ్ముడుపోని కార్ల జాబితా 7 లక్షులు దాటింది.

FADA ప్రకారం భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద కార్ మార్కెట్. అయితే ఇప్పుడు ఇది కార్ మార్కెట్‌కు ఆందోళన కలిగించే విషయం. పండుగల సీజన్ ప్రారంభం కాబోతోంది, కానీ ఇప్పటికీ కార్ల అమ్మకాలు నిరంతరం పడిపోతున్నాయి. కొత్త కార్ల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీని కారణంగా డీలర్ల వద్ద పాత స్టాక్ పెరుగుతోంది. వారు ప్రతిరోజూ నష్టపోతున్నారు. డీలర్లు కూడా తమ విక్రయాలను పెంచుకునేందుకు అదనపు రాయితీలను ఆశ్రయిస్తున్నారు.

FADA ప్రకారం ప్రస్తుతం 7.30 లక్షల వాహనాలు డీలర్ల వద్ద నిలబడి ఉన్నాయి. ఇది 2 నెలల విక్రయాలకు సమానం. అయితే SIAM (ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్) ప్రకారం ఈ సంఖ్య దాదాపు 4 లక్షల యూనిట్ల కార్లు. గత నెల (ఆగస్టు)లో చాలా కార్ల కంపెనీలు గత ఏడాది జూలై నెలతో పోలిస్తే 9.65 శాతం తక్కువ అమ్మకాల్లో భారీ క్షీణతను నమోదు చేశాయి.

ప్రస్తుతం కార్ల కంపెనీలు తమ కార్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. టాటా మోటార్స్ తన సఫారీ, హారియర్, నెక్సాన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. హ్యుందాయ్ వెన్యూ, ఎక్స్‌టర్‌పై రూ.70 వేల వరకు తగ్గింపును ఇస్తోంది. ఇది కాకుండా జీప్ ఇండియా తన గ్రాండ్ చెరోకీపై రూ. 12 లక్షల తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు దాని ధర రూ. 68.50 లక్షలుగా మారింది. గతంలో దీని ధర రూ.80 లక్షల 50 వేలుగా ఉండేది.

Tags:    

Similar News