Car Washing Tips: కారు కడుగుతున్నారా.. ఈ పొరపాట్లు చేస్తే పెయింటింగ్ పోతుంది జాగ్రత్త..!
Car Washing Tips: కారు కొనడం కాదు దాని మెయింటనెన్స్ అనేది చాలా ముఖ్యం.
Car Washing Tips: కారు కొనడం కాదు దాని మెయింటనెన్స్ అనేది చాలా ముఖ్యం. కొంతమంది కారును కొన్ని కారణాల వల్ల సర్వీసింగ్‌కి ఇవ్వరు. ఇంటివద్దే వాష్ చేస్తుంటారు. ఇలాంటి వారు తరచుగా కొన్ని తప్పులు చేయడం వల్ల కారు పెయింటింగ్ పాడయ్యే అవకాశాలు ఉంటాయి. కారు కడిగే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.
నీడలో కడగడం: కారును ఎప్పుడూ ఎండలో కడగవద్దు. దీనివల్ల సబ్బు, నీటి మరకలు ఏర్పడుతాయి. నీడలో కడగడం వల్ల మరకలు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది.
కార్ వాష్ షాంపూ: కారును కడగడానికి ఎలాంటి డిటర్జెంట్‌ను ఉపయోగించవద్దు. ఇది పెయింటింగ్‌ను దెబ్బతీస్తుంది. దీని కోసం డెడికేటెడ్ కార్ వాష్ షాంపూ ఉపయోగించాలి.
మృదువైన స్పాంజ్: కారును కడగడానికి గట్టి స్పాంజ్ ఉపయోగించవద్దు. మృదువైన స్పాంజ్‌ని ఉపయోగించాలి. గుడ్డను అస్సలు ఉపయోగించవద్దు. అవసరమైతే మైక్రోఫైబర్ వస్త్రాన్ని ఉపయోగించవచ్చు.
పై నుంచి కిందికి కడగాలి: కారును ముందుగా పై నుంచి కడగడం ప్రారంభించి ఆపై నెమ్మదిగా కిందికి రావాలి. దీని వల్ల దుమ్ము ధూళి కిందికి వస్తాయి.
నీటి ప్రవాహం: బలమైన నీటి ప్రవాహం పెయింట్‌ను దెబ్బతీస్తుంది. అందువల్ల వీటి ప్రెషర్ ద్వారా కారును కడగవద్దు. నార్మల్‌గా అదుపులో ఉంచుకొని వాటర్ కొట్టాలి.
ఆరబెట్టాలి: కారును కడిగిన తర్వాత మెత్తటి గుడ్డతో తుడిచి కొద్దిసేపు గాలికి ఆరనివ్వాలి. ఇది నీటి మచ్చలు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది. దీనివల్ల కారు పెయింట్ మెరుస్తుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల కారు పెయింట్ పాడవకుండా కాపాడుకోవచ్చు. కొత్త కారులా మెరిసేలా చేయవచ్చు.