Safe Driving Tips: కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!
Safe Driving Tips: వాహనాలు నడిపేటప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రమాదాలకి గురికావాల్సి ఉంటుంది.
Safe Driving Tips: వాహనాలు నడిపేటప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రమాదాలకి గురికావాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొండప్రాంతాల్లో వాహనాలు నడిపేవారు అలర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా కష్టమైన ప్రమాదంతో కూడుకున్న పని. ఈ పరిస్థితిలో డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత శ్రద్ధ, జాగ్రత్త అవసరం. పర్వత ప్రాంతాల్లో సురక్షితమైన డ్రైవింగ్ కోసం కొన్ని చిట్కాలని ఈరోజు తెలుసుకుందాం.
వేగాన్ని అదుపులో ఉంచుకోవాలి
కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు వేగాన్ని అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా కొండలు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వేగంగా డ్రైవింగ్ చేయడం వల్ల కారుపై కంట్రోల్ కోల్పోతారు. కొండలపైకి వెళ్లేటప్పుడు తక్కువ గేర్‌ని ఉపయోగించాలి.
బ్రేక్‌లను సరిగ్గా ఉపయోగించాలి
కొండలపై డ్రైవింగ్ చేసేటప్పుడు బ్రేక్‌లను సరిగ్గా ఉపయోగించాలి. బ్రేక్‌లను నిరంతరం తొక్కుతూ డ్రైవింగ్ చేయవద్దు. దీనివల్ల బ్రేకులు హీట్ అయి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవసరమైనప్పుడు మాత్రమే బ్రేకులు వేయాలి. తక్కువ గేర్‌లో ఉన్నప్పుడు ఇంజిన్ బ్రేకింగ్ పద్ధతులను కూడా ఉపయోగించాలి.
రహదారి గుర్తులని చూసుకోవాలి
డ్రైవింగ్ చేసేటప్పుడు రహదారి గుర్తులని జాగ్రత్తగా గమనించాలి. వేగం లేదా మూలమలుపు మొదలైన వాటికి సంబంధించిన హెచ్చరికలని గుర్తుంచుకోవాలి. వాటికనుగుణంగా డ్రైవింగ్ పద్దతి ఉండాలి.
వాహనాల మధ్య దూరం ఉండాలి
ముందు వెళ్లే వాహనాలకి కొంచెం దూరంగా ఉండాలి. ఎత్తుపైకి వెళుతున్నట్లయితే ఇది చాలా అవసరం. ఎందుకంటే ముందు వాహనం వేగాన్ని తగ్గించినా, అనుకోకుండా ఆగిపోయినా లేదా వెనుకకు వచ్చినా రియాక్ట్ కావడానికి తగినంత సమయం ఉంటుంది.
వాతావరణ పరిస్థితులు గమనించాలి
పర్వతాలపై ప్రమాదం అనేది కొంచెం ప్రమాదంతో కూడుకున్నది. ఇక్కడ తరచుగా వాతావరణ పరిస్థితులని గమనించి వాహనం నడపాలి. పొగమంచు, వర్షం, మంచు మొదలైనవి డ్రైవింగ్‌ని కష్టతరం చేస్తాయి. వాతావరణ పరిస్థితులను గమనించి తదనుగుణంగా డ్రైవింగ్ చేయాలి.