Buying Used Car: పాతకారు కొంటున్నారా.. డబ్బు ఆదా అవుతుందా వృథా అవుతుందా..!

Buying Used Car: ఈ రోజుల్లో చాలామంది కొత్త కారు కంటే సెకండ్‌ హ్యాండ్‌ కార్లు కొనడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

Update: 2024-03-23 11:30 GMT

Buying Used Car: పాతకారు కొంటున్నారా.. డబ్బు ఆదా అవుతుందా వృథా అవుతుందా..!

Buying Used Car: ఈ రోజుల్లో చాలామంది కొత్త కారు కంటే సెకండ్‌ హ్యాండ్‌ కార్లు కొనడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో మార్కెట్‌లో సెకండ్‌ హ్యాండ్‌ కార్ల బిజినెస్‌ విపరీతంగా పెరిగింది. దాదాపు అన్ని కార్ల కంపెనీలు సెకండ్‌ హ్యాండ్‌ కార్ల క్రయ విక్రయాలు జరుపుతున్నా యి. ఒక వ్యక్తి పాత కారు కొన్నప్పుడు డబ్బు ఆదా చేస్తాడని అనుకుంటాడు కానీ అదే సమయం లో నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. నిజానికి సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు ఆదా అవుతుందా వృథా అవుతుందా ఈ రోజు తెలుసుకుందాం.

ముందుగా కారును బయటి నుంచి చెక్‌ చేయాలి

ముందుగా కారును భౌతికంగా చెక్‌ చేయాలి. కారు లోపలి, వెలుపలి భాగాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. గీతలు, తుప్పు గుర్తులపై శ్రద్ధపెట్టాలి. ఇంజిన్, టైర్లు, ఇతర ముఖ్యమైన భాగాలను చెక్‌ చేయాలి. ఎక్కడ ఏ లోపం ఉందో బాగా గమనించాలి.

సర్వీస్ హిస్టరీ

కారు సర్వీస్ హిస్టరీని తప్పకుండా చెక్ చేయాలి. ఇది కారుకు ఎప్పుడు ఏం జరిగిందో తెలియజేస్తుంది. ఇందులో ఏదైనా గ్యాప్‌ని ఉన్నట్లయితే సర్వీసింగ్ రికార్డులు, యాక్సిడెంట్‌ హిస్టరీ తెలిసిపోతుంది.

టెస్ట్ డ్రైవ్

కారును మీరే డ్రైవ్ చేసుకుంటే తప్ప దాని గురించి తెలుసుకోలేరు. కాబట్టి టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇంజిన్ లేదా సస్పెన్షన్ నుంచి ఏవైనా వింత శబ్దాలు వస్తున్నాయా, ట్రాన్స్మిషన్ సాఫీగా ఉందా, ఏసీ ఎలా పని చేస్తుంది, ఇతర ఫీచర్లు ఎలా పని చేస్తున్నాయో గమనించండి.

మెకానిక్ చెక్

మీకు కార్ల గురించి పెద్దగా తెలియకపోతే మెకానిక్ సలహా తీసుకోండి. అతడిచే కారును చెక్‌ చేయించండి. అతడు కారు పరిస్థితి గురించి స్పష్టంగా చెప్పగలడు. దీని కోసం మీకు తెలిసిన ప్రొఫెషనల్ లేదా మెకానిక్ సాయం తీసుకోవచ్చు.

పేపర్లు

ఆర్‌సీ, బీమా, సర్వీస్‌ హిస్టరీ వంటి అన్ని అవసరమైన పత్రాలను చెక్‌ చేయాలి. కారుపై ఎలాంటి బకాయి, చలాన్ల గురించి ఎంక్వయిరీ చేయండి. కారుకు ఇన్సూరెన్స్ లేకపోతే చర్చల సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించండి. కారు ధరను తగ్గించడానికి ప్రయత్నించండి.

చర్చలు జరపండి

కారు ధరపై బాగా చర్చించండి. కారు తనిఖీ సమయంలో మీరు గమనించిన లోపాలు ఏవైనా ఉంటే వాటిగురించి యజమాని దగ్గర ప్రస్తావించి దాని ధరను తగ్గించమని అడగండి. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని అన్నీ సరిగ్గా ఉంటేనే వాడిన కారును కొనండి. అప్పుడు ఉపయోగించిన కారును కొనుగోలు చేయడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. కానీ కారులో పెద్ద లోపం ఉంటే దానిని ముందుగా గుర్తించలేకపోతే అది మిమ్మల్ని లాస్‌ చేయిస్తుంది.

Tags:    

Similar News