Aprilia: అప్రిలియా నుంచి 457 సీసీ ఇంజన్ బైక్.. మేడ్-ఇన్-ఇండియా స్పోర్ట్స్ బైక్ చూస్తే పరేషానే.. ధరెంతంటే?
ఇటాలియన్ బైక్ తయారీదారు అప్రిలియా ఎట్టకేలకు యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో తన RS457 స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేసింది.
Aprilia: ఇటాలియన్ బైక్ తయారీదారు అప్రిలియా ఎట్టకేలకు యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో తన RS457 స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేసింది. UK కరెన్సీ ప్రకారం, ఈ బైక్ ధర GBP 6,500 (సుమారు రూ. 6.79 లక్షలు)గా ఉంచింది. ఇది భారతదేశం నుంచి ఎగుమతి చేయబడుతోంది. ఎప్రిలియా RS457 కవాసకి నింజా 400, యమహా YZF-R3 లకు పోటీగా ఉంది. A2 లైసెన్స్ ఉన్నవారు యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఈ బైక్‌ను కొనుగోలు చేయగలుగుతారు.
UKలో ఈ బైక్ నుంచి బ్రాండ్‌కు మంచి విక్రయాలు లభిస్తాయని భావిస్తున్నారు. అయితే, Aprilia RS457 దాని ప్రత్యర్థుల కంటే చాలా ఖరీదైనది. ఇది Yamaha YZF-R3 RS457 కంటే ఎక్కువ ధరతో వస్తుంది.
RS457 457cc, లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజన్ నుంచి శక్తిని పొందుతుంది. ఈ ఇంజన్ సుమారు 47bhp శక్తిని, 43.5Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేసింది. బైక్‌లో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. ఈ స్టైలిష్ బైక్‌కు ముందు వైపున అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ యూనిట్ అమర్చబడింది. మెరుగైన బ్రేకింగ్ కోసం ఈ బైక్‌లో డ్యూయల్-ఛానల్ ABS అమర్చబడింది.
ఇది కాకుండా, బైక్‌లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఇంజిన్ మ్యాప్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబిఎస్, యాంటీ-రోల్ సిస్టమ్, మూడు రైడింగ్ మోడ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. బైక్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 5-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఏప్రిలియా RS457 భారతదేశంలో, అంతర్జాతీయ మార్కెట్లలో మూడు రంగులలో అందుబాటులో ఉంది. ఇటాలియన్ బ్రాండ్ ప్రస్తుతం ఈ బైక్‌ను మహారాష్ట్రలోని బారామతిలో ఉన్న ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తోంది.